దిశా పటానీ డీప్ క్లేవేజ్ పై సెన్సార్ ఆభ్యంతరం!
సూర్య కథానాయకుడిగా నటించిన `కంగువ` సినిమా భారీ అంచనాల మధ్య నవంబర్ లో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 Oct 2024 6:09 AM GMTసూర్య కథానాయకుడిగా నటించిన `కంగువ` సినిమా భారీ అంచనాల మధ్య నవంబర్ లో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు పీక్స్ కి చేరాయి. సూర్య లుక్, వార్ సన్నివేశాలు ప్రతీది అంతంకంతకు హైప్ తీసుకొచ్చాయి. సూర్య కెరీర్ లో తొలి పాన్ ఇండియా రిలీజ్ ఇదే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కారణంగా సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ పాటలో దిశా పటానీ ధరించిన డ్రెస్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది సెన్సార్ బోర్డ్.
ఇటీవలే ఆ సినిమాలోని `యోలో యుఒన్లీ లైవ్ వన్స్` అనే పాటను రిలీజ్ చేసారు. ఈ పాట ట్రెండింగ్ లో నిలిచింది. సూర్య-దిశా పటానీ మధ్య కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. నెటి జనులంతా ఫిదా అవుతున్నారు. అయితే ఈ పాటలో మూడు సెకన్ల పాటని ట్రిమ్ చేయాలని ఆదేశించింది. దిశా పటానీ ధరించిన డీప్ క్లీవేజ్ డ్రెస్ తో ఉన్న సన్నివేశాలు పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. జీన్స్ ప్యాంట్ పై బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బ్లౌజ్ ధరించింది.
ఈ బ్లౌజులో దాదాపు దిశా అందాలే టార్గెట్ అయ్యాయి. దీంతో ఆ భాగాలపై బ్లర్ కాకుండా నేరుగా ఆ దృశ్యాన్నే తొలగించాలని బోర్డ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇలాంటి సన్నివేశాలు సమాజంలో చెడు సంకేతంగా వెళ్తాయని, ఇప్పటికే సినిమాలపై ప్రభావం యువతపై తీవ్రంగా ఉందని సెన్సార్ అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో మేకర్స్ కూడా అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. మూడు సెకన్ల పాటను ట్రిమ్ చేయనున్నారు. నవంబర్ 14న సినిమా రిలీజ్ అవుతుంది.
వాస్తవానికి ఇప్పటికే రిలీజ్ కావాలి. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యంగా కారణంగా వాయిదా వేసారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో స్టూడియో గ్రీన్- యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. సూర్య కెరీర్ లో ఇదే తొలి భారీ బడ్జెట్ చిత్రం. ఈ చిత్రం టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు.