కంగువా.. బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే..
ముఖ్యంగా ఈ సినిమా తప్పకుండా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంటుందని దర్శక నిర్మాతలు ఎంతో ధీమాగా కనిపించారు.
By: Tupaki Desk | 15 Nov 2024 3:19 PM GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా గురువారం రోజు గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మేకర్స్ ఏ స్థాయిలో ప్రమోషన్స్ చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా ప్రధాన రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా తప్పకుండా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంటుందని దర్శక నిర్మాతలు ఎంతో ధీమాగా కనిపించారు.
ముఖ్యంగా ప్రమోషన్ కోసం మేకర్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు. తెలుగులో అయితే విడుదలకు మూడు వారాల ముందే సినిమాను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. కమర్షియల్ మాస్ డైరెక్టర్ శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్, అలాగే యూవి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాయి. ఇక విడుదలైన మొదటి రోజు ఈ సినిమాకు టాక్ మాత్రం కొత్త డిఫరెంట్ గా వచ్చింది.
అయినప్పటికీ మేకర్స్ మాత్రం నమ్మకం కోల్పోవడం లేదు. తప్పకుండా సినిమా రోజురోజుకు కలెక్షన్స్ రేంజ్ ను పెంచుకుంటూ వెళుతుంది అని నమ్మకంతో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద 58.62 కోట్లను రాబట్టింది. రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు.
సూర్య కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా కంగువా టాప్ లిస్టులో నిలిచింది. ఈ సినిమాలో సూర్య నటించిన విధానం ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. సూర్య ఒక పాత్రలోకి ప్రవేశిస్తే ఎంతగా హైలైట్ అవుతాడో ఈ సినిమా ద్వారా అర్థమవుతుంది. ఇక బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అతను చేసిన పాత్ర సినిమాలో చాలా బాగా హైలైట్ అయింది.
ఇక మిగతా నటీనటులు కూడా వారి పాత్రకు తగ్గట్టుగా అద్భుతమైన టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో ఆర్ట్ వర్క్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి అంటూ మేకర్స్ ముందుగానే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. సినిమాపై ఉన్న హైప్ కారణంగా మొదటి రోజు అయితే 50 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇక వీకెండ్ లో కూడా ఇదే తరహాలో కొనసాగితే పెట్టిన పెట్టుబడి చాలా తొందరగా వెనక్కి వచ్చేస్తుంది. మరి కంగువా ఫుల్ రన్ లో ఏ స్థాయిలో రికార్డులను అందుకుంటుందో చూడాలి.