కంగువ నుంచి ఆ సీన్స్ కట్..!
ఐతే సినిమా టాక్ కు ఇది కూడా ఒక కారణమని గుర్తించిన చిత్ర యూనిట్ సినిమాను 12 నిమిషాలు ట్రిం చేసినట్టు తెలుస్తుంది.
By: Tupaki Desk | 19 Nov 2024 9:33 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కంగువ. యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి నిర్మించిన ఈ సినిమా కోసం 300 కోట్ల పైన బడ్జెట్ కేటాయించారని తెలుస్తుంది. పీరియాడికల్ డ్రామాగా 1000 ఏళ్ల నాటి కథతో వచ్చిన కంగువ నవంబర్ 14న గ్రాండ్ గా రిలీజైంది. తెలుగులో బాహుబలి లానే కోలీవుడ్ నుంచి కంగువ కూడా ఆ రేంజ్ సక్సెస్ అందుకుంటుందని అనుకున్నారు.
కానీ సినిమా చూసిన ఆడియన్స్ నిరాశ చెందారు. సినిమా కథ ఏదో అన్నట్టు అనిపించినా కథనం ప్రేక్షకులను మెప్పించలేదు. మొదటి రోజు మిశ్రమ స్పందనతో మొదలై రోజు గడుస్తున్నా కొద్దీ సినిమాపై నెగిటివిటీ పెరిగిపోయింది. సూర్య స్టామినా కొద్దీ ఏదో వసూళ్లు వస్తున్నాయని చెప్పొచ్చు. ఐతే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా రన్ టైం కూడా పెద్ద సమస్యగా మారింది. ఐతే సినిమా టాక్ కు ఇది కూడా ఒక కారణమని గుర్తించిన చిత్ర యూనిట్ సినిమాను 12 నిమిషాలు ట్రిం చేసినట్టు తెలుస్తుంది.
నేడు సాయంత్రం ఆట నుంచి 12 నిమిషాలు కట్ చేసిన సినిమా ప్రదర్శించబడుతుంది. ఐతే మేకర్స్ తెలిపిన దాన్ని బట్టి కంగువ సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి కొన్ని సీన్స్.. సెకండ్ హాఫ్ నుంచి కొన్ని సీన్స్ ట్రిం చేసినట్టు తెలుస్తుంది. దిశా పటాని సీన్స్ కూడా ట్రిమ్ చేసినట్టు చెప్పారు. ఒక సినిమా ఇలా రిలీజ్ తర్వాత ట్రిమ్ చేసినంత మాత్రానా సినిమా కలెక్షన్స్ పెరుగుతాయా.. ఆడియన్స్ కి ఆ సినిమాపై ఆసక్తి కలుగుతుందా అంటే చెప్పడం కష్టం.
ఐతే ఇక మీదట చూసే వారికైనా సరే లెంగ్త్ ఇంకా అవసరం లేని సీన్స్ ఇబ్బంది కలగకూడదు అనే ఇలా ప్లాన్ చేశారు. ఐతే ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగాక ఇప్పుడు ఏం చేసినా ఉపయోగం ఉండదనే చెప్పాలి. అయినా సరే కంగువ టీం వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
కంగువ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించారు. దిశా పటాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాంగ్స్ వరకు బాగున్నా బిజిఎం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.