తమిళ బాహుబలి 'కంగువా'.. ఫైనల్ కలెక్షన్స్ మరీ దారుణం
బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాట కంగువా సినిమా థియేట్రికల్ రన్ పూర్తి అయ్యేప్పటికి రూ.35.85 కోట్లు
By: Tupaki Desk | 18 Dec 2024 1:23 PM GMTతమిళ 'బాహుబలి' అంటూ ప్రచారం జరిగిన 'కంగువా' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఖాయం అంటూ ప్రచారం చేశారు. ముఖ్యంగా నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమాకు వెయ్యి కోట్లకు తగ్గకుండా వసూళ్లు వస్తాయి అంటూ చాలా నమ్మకంగా చెప్పుకొచ్చాడు. కానీ సినిమా లాంగ్ రన్‌లో కనీసం ఆయన చెప్పిన దాంట్లో పావలా వంతు రాబట్టలేకపోయింది. ఇప్పటికే తమిళనాడుతో పాటు అన్ని చోట్ల ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి అయ్యింది. బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రూ.102.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది.
సూర్య హీరోగా దిశా పటానీ హీరోయిన్‌గా శివ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌తో కలిసి స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సినిమాకు ముందస్తుగా వచ్చిన హైప్ కారణంగా దాదాపుగా రూ.200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదల అయిన ఈ సినిమా కనీసం అందులో సగం వసూళ్లు రాబట్టలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.50 కోట్ల బిజినెస్‌ను చేసిన ఈ సినిమా అందులో సగం రాబట్టలేక పోయింది. మొత్తంగా కంగువా సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచి తమిళ సినిమా పరువు తీసింది.
బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాట కంగువా సినిమా థియేట్రికల్ రన్ పూర్తి అయ్యేప్పటికి రూ.35.85 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.15.75 కోట్లు, కేరళలో రూ.6.30 కోట్లు, కర్ణాటక రూ.4.50 కోట్లు, దేశంలో ఇతర ప్రాంతాల్లో రూ.16 కోట్లు, ఓవర్సీస్ రూ.24 కోట్లు వసూళ్లు సాధించింది. రూ.102.45 కోట్ల వసూళ్లతో వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రన్ క్లోజ్ అయ్యింది. సూర్య కెరీర్‌లోనే కాకుండా తమిళ సినీ ఇండస్ట్రీలో అతి పెద్ద డిజాస్టర్‌గా ఈ సినిమా నిలిచింది. రాధేశ్యామ్ సినిమా తర్వాత ఈ సినిమా అత్యంత భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లోనూ మినిమం ప్రమోషన్ ఖర్చు రాబట్టలేక పోయిన ఈ సినిమా గురించి నిర్మాతలు భారీ ఎత్తున ప్రచారం చేశారు. విడుదల తర్వాత వందల కోట్ల వసూళ్లు అంటు ప్రచారం చేశారు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమా కనీసం రూ.100 కోట్ల షేర్‌ను రాబట్టలేక పోయింది. దాదాపుగా రూ.130 కోట్ల నష్టంతో ఈ సినిమా రన్ ముగిసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధిస్తుందని భావించిన వసూళ్లలో కనీసం సగం కూడా రాబట్టలేక పోగా ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. సినిమా ట్రోల్స్ పై పలువురు స్పందిస్తూ సినిమా పర్వాలేదు, మరీ అంత ట్రోల్ చేయవద్దని విజ్ఞప్తి చేసిన సందర్భాలు ఉన్నాయి.