Begin typing your search above and press return to search.

ఒకే ఫ్రేమ్ లో రజిని, ప్రభాస్, సూర్య..!

టైటిల్ చూసి ఇదేదో పెద్ద మల్టీస్టారర్ సినిమా అయ్యుంటుంది అనుకుంటే పొరపడినట్టే.

By:  Tupaki Desk   |   14 Oct 2024 9:23 AM GMT
ఒకే ఫ్రేమ్ లో రజిని, ప్రభాస్, సూర్య..!
X

టైటిల్ చూసి ఇదేదో పెద్ద మల్టీస్టారర్ సినిమా అయ్యుంటుంది అనుకుంటే పొరపడినట్టే. అసలు రజిని, ప్రభాస్, సూర్య ఈ కాంబో సినిమా పడితే రికార్డులన్నీ తిరగ రాయడం కాదు షెడ్ కి వెళ్లాల్సిందే. ఐతే ఈ కాంబో ఒప్పించేలా కథ రెడీ అయితే మాత్రం వారు సినిమా చేయడానికి రెడీ అనే చెప్పొచ్చు. ఐతే ప్రస్తుతం సినిమా కాదు కానీ ఒకే వేదిక మీద ఈ ముగ్గురు కనిపించనున్నారు. అది కూడా సూర్య సినిమా ఈవెంట్ కోసం రజిని, ప్రభాస్ స్పెషల్ గెస్ట్ లుగా వస్తున్నారని తెలుస్తుంది.

సూర్య ప్రస్తుతం చేస్తున్న కంగువ సినిమా నవంబర్ 14న రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమా ఆడియో ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి నిర్మిస్తున్న కంగువ సినిమాను శివ డైరెక్ట్ చేస్తున్నారు. పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమాలో సూర్య నట విశ్వరూపం చూపించారని తెలుస్తుంది. ఐతే సూర్య కంగువ సినిమా వేడుకకు ప్రభాస్ రావడం వెనక రీజన్ యువి క్రియేషన్స్ అని తెలుస్తుంది.

యువి బ్యానర్ అంటే ప్రభాస్ సొంత బ్యానర్ లానే అనుకోవచ్చు. అందుకే తన స్నేహితులు వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న కంగువ ప్రమోషన్స్ కి ప్రభాస్ ఓకే అనేయొచ్చు. అదీగాక సూర్య మీద ఉన్న అభిమానం కూడా దానికి తోడవుతుంది. ఇక రజిని విషయానికి వస్తే అక్టోబర్ 10న వేట్టయ్యన్ ఒక్క సినిమానే రిలీజ్ అవ్వడానికి సూర్యనే కారణం. అసలైతే వేట్టయ్యన్ తో పాటే కంగువ రావాల్సి ఉన్నా సూపర్ స్టార్ మీద అభిమానంతో తన సినిమా వాయిదా వేసుకున్నారు.

అలా రజిని కూడా కంగువకు తనకు తోచినంత సపోర్ట్ ఇచ్చేందుకు వస్తున్నారు. సూర్య, రజిని, ప్రభాస్ ఈ ముగ్గురు అలా ఒకే ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ ఫోటో మామూలుగా ఉండదు. ఈవెంట్ లో వీరి సంభాషణ, క్లోజ్ నెస్ ఎలా ఉంటుందో చూసి వెంటనే ఈ ముగ్గురి కోసం కథ సిద్ధం చేస్తే మాత్రం ఈ కాంబో సినిమా చూసే అవకాశం కూడా ఉంటుంది. మరి సూర్య కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రజిని, ప్రభాస్ వస్తారా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. సూర్య కంగువ అవుట్ పుట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో కంగువ ఒక సంచలనం సృష్టిస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.