వేట్టయన్ ఎఫెక్ట్! కంగువా ప్లాన్ ఛేంజ్?
సమయంలో నిర్మాత జ్ఞానవేల్ రాజా కంగువ ప్రమోషన్స్ కోసం ట్విట్టర్ లో స్పందించారు.
By: Tupaki Desk | 14 Oct 2024 8:30 PM GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. మూవీ లవర్స్ లో మంచి ఆసక్తి నెలకొంటుంది. సూర్య నటించిన అన్ని సినిమాలు.. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకే సమయంలో రిలీజ్ అవుతుంటాయి. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి మంచి వసూళ్లు రాబడుతుంటాయి. ఇప్పుడు సూర్య.. కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరో హిట్ కొట్టేందుకు చూస్తున్నారు..
సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న కంగువా.. రాజుల కాలం నాటి కథతో రూపొందుతోంది. దిశా పటానీ, బాబీ డియోల్, కోవై సరళ, యోగి బాబు, రెడ్టిన్ కింగ్స్లీ, నటరాజన్ సుబ్రమణ్యన్, జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. నవంబర్ 14వ తేదీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ రీసెంట్ గా ప్రకటించారు. అయితే ప్రమోషన్స్ లో మాత్రం మేకర్స్ స్పీడ్ ను పెంచలేదు.
భారీగా ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించిన మేకర్స్.. చెప్పినట్టు చేయడం లేదు. దీంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో నిర్మాత జ్ఞానవేల్ రాజా కంగువ ప్రమోషన్స్ కోసం ట్విట్టర్ లో స్పందించారు. బడా హీరోల సినిమాల మేకర్స్ లాగా.. క్యారెక్టర్ రివీల్ పోస్టర్స్ ను ఎందుకు విడుదల చేయడం లేదని ఓ ఫ్యాన్ క్వశ్చన్ చేశారు. దీంతో ఇటీవల ఓ బిగ్ హీరో మూవీ విషయంలో అదే స్ట్రాటజీ ఫాలో అయ్యారని ఆయన అన్నారు.
రిలీజ్ కు ముందే సినిమాలోని స్టార్ క్యాస్టింగ్ ను రివీల్ చేశారని గుర్తుచేశారు. కానీ ఆ స్ట్రాటజీ.. మూవీ ఓపెనింగ్స్ కు ఉపయోగపడుతుందా అని అడిగారు. కాబట్టి సూర్య ఫ్యాన్స్ కలవరపడొద్దని తెలిపారు. సైలెంట్ గా ఉండాలని కోరారు. నవంబర్ 14వ తేదీన పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పాన్ ఇండియా మూవీ కనుక.. లోకల్ గా కలెక్షన్ ఫైట్ కు దిగవద్దని రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం జ్ఞానవేల్ రాజా చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అదే సమయంలో పలువురు రజనీకాంత్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. వేట్టయన్ మూవీపైనే జ్ఞానవేల్ పరోక్షంగా కామెంట్స్ చేశారని చెబుతున్నారు. రిలీజ్ కు ముందు క్యారెక్టర్ రివీల్ పోస్టర్స్ ద్వారా భారీ అంచనాలు నెలకొల్పిన ఆ సినిమా.. జైలర్ కన్నా తక్కువ ఓపెనింగ్స్ సాధించింది. ఆ విషయాన్నే ఇప్పుడు ఆయన ప్రస్తావించినట్లు ఉన్నారని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు. మరి జ్ఞానవేల్ ఎవరిని ఉద్దేశించి అన్నారో ఆయనకే తెలియాలి.