Begin typing your search above and press return to search.

కంగువ.. తస్కరించారా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Sep 2024 10:37 AM GMT
కంగువ.. తస్కరించారా?
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఆయన చేస్తున్న కంగువ మూవీ.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పీరియాడికల్ యాక్షన్ జోనర్ లో రూపొందుతున్న ఆ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

కంగువ నుంచి మేకర్స్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, వీడియో గ్లింప్సెస్, సాంగ్స్... అన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్.. సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. పీరియాడికల్ యాక్షన్ జానర్‌ లో ఇప్పటి వరకు రానటువంటి కొత్త కాన్సెప్ట్ తీసుకుని సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. విజువల్ వండర్ లా ఉండనుందని ట్రైలర్ చూస్తే ఈజీగా అర్థమవుతోంది.

క్రూరమైన మనుషులు మధ్య తన తెగను కాపాడుకోవడానికి హీరో ఏం చేశాడనే పాయింట్ తో సినిమా తెరకెక్కుతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. హాలీవుడ్ మూవీలు చూసే అలవాటు ఉన్న కొందరు సినీ ప్రియులు.. కంగువ ట్రైలర్ లోని స్క్రీన్ షాట్స్ ను తీసి పోస్ట్ చేస్తున్నారు. అమెరికన్ హిస్టారికల్ థ్రిల్లర్ 300 మూవీలోని ఎలిమెంట్స్ తో పోల్చుతున్నారు.

కంగువ ట్రైలర్ లో మేకర్స్ చూపించిన ఐకానిక్ స్పార్టన్ లుక్, షిప్‌ లు, మ్యాప్‌ లు, చారిత్రక నాణేలకు గాను 300 మూవీ నుంచి రిఫరెన్స్ తీసుకున్నట్లు అనిపిస్తోందని చెబుతున్నారు. ట్రైలర్ ద్వారా విజువల్ ఎక్సపీరియన్స్ ఇచ్చినప్పటికీ.. స్పార్టన్ ఎలిమెంట్స్ మాత్రం రిఫరెన్స్ గా తీసుకున్నట్లు క్లియర్ గా కనబడుతోందని అంటున్నారు. స్పార్టన్ ఎలిమెంట్స్ విషయంలో డైరెక్టర్ శివ కాస్త వేరియేషన్ చూపించినప్పటికీ.. హిస్టరీని కాపీ కొట్టారని అంటున్నారు.

అయితే ఎలిమెంట్స్ ఎక్కడ తీసుకున్నా.. కంటెంట్ బాగుంటే ఇప్పుడు వచ్చిన వార్తలు పక్కకు వెళ్ళిపోతాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. కంగువ సినిమాను దసరా కానుకగా మేకర్స్ రిలీజ్ చేద్దామని అనుకున్నారు. అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ అదే సమయంలో రజనీకాంత్ వెట్టియన్ చిత్రం విడుదల కానుంది. తలైవా మూవీ సింగిల్ గా రిలీజ్ కావాలని సూర్య ఇటీవల తెలిపారు. దీంతో కంగువ పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమైంది. త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.