కంగువ OTT.. ప్లాన్ మార్చేశారా..?
1000 ఏళ్ల నాటి కథతో విజువల్ వండర్ గా తెరకెక్కిన కంగువ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.
By: Tupaki Desk | 25 Nov 2024 9:30 AM GMTసూర్య నటించిన కంగువ సినిమాను శివ డైరెక్ట్ చేశారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు పెంచుతూ రాగా నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ చేశారు. అసలైతే దసరా బరిలో అక్టోబర్ సెకండ్ వీక్ లో సినిమాను రిలీజ్ చేయాలని అనుకోగా అది కాస్త నవంబర్ 14కి వాయిదా వేసుకున్నారు. 1000 ఏళ్ల నాటి కథతో విజువల్ వండర్ గా తెరకెక్కిన కంగువ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.
కంగువ సినిమా రిజల్ట్ పై సూర్య అండ్ టీం చాలా నిరుత్సాహంగా ఉన్నారు. సినిమా ఎంత భారీగా తీశామన్నది కాదు ఆడియన్స్ కు ఎంత రీచ్ అయ్యిందన్నది ముఖ్యం. కంగువ సినిమాలో అదే కొరవడింది. సినిమాలో ఏ ఎమోషన్ సరిగా వర్క్ అవుట్ కాలేదు. అందుకే థియేటర్ లో ఈ సినిమాకు ఆ ఫలితం వచ్చింది. ఐతే కంగువ సినిమాను థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్టే అనిపిస్తుండగా సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్నారు.
అమేజాన్ ప్రైం కంగువ సినిమా డిజిటల్ రైట్స్ ను పొందింది. భారీ దరకే అమెజాన్ ప్రైమ్ కంగువ హక్కులను పొందగా అసలైతే సినిమా రిలీజైన 8 వారాల తర్వాత డిజిటల్ రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు. కానీ థియేట్రికల్ రన్ అంత సంతృప్తికరంగా లేదు కాబట్టి అనుకున్న దాని కన్నా ముందే ఓటీటీ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. కంగువ ఓటీటీ రిలీజ్ ఎప్పుడన్నది చెప్పలేదు కానీ సినిమాను త్వరలోనే అమేజాన్ ప్రైమ్ డిజిటల్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారని తెలుస్తుంది.
మరి థియేటర్ లో ప్రేక్షకులను మెప్పించలేని కంగువ ఓటీటీలో అయినా అలరిస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటించగా సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. కోలీవుడ్ బాహుబలి అవుతుందని ఊహించిన ఈ సినిమా ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసింది. ఏది ఏమైనా రెండేళ్లకు పైగా సూర్య కంగువ కోసం పడిన కష్టమంతా వృధా అయ్యిందని చెప్పొచ్చు. ఐతే సినిమా రిజల్ట్ ఇలా వస్తుందని ఊహించని మేకర్స్ కంగువ పార్ట్ 2 ని కూడా ప్లాన్ చేశారు. కంగువ సినిమాలో యానిమల్ స్టార్ బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటించారు. సినిమాకు ఏది ప్లస్ అవుతుందని అనుకున్నారో అవే రివర్స్ అయ్యాయి. అందుకే రిలీజ్ తర్వాత కంగువ టీం లెంగ్త్ ఇష్యూ అని తర్వాత ట్రిమ్ చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.