హిట్ కాంబో మూవీ న్యూ ఇంట్రస్టింగ్ అప్‌డేట్
సూర్య గతంలో చేసిన ఆకాశమే నీ హద్దురా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
By: Tupaki Desk | 7 Dec 2023 5:28 AM GMTతమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'కంగువా' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. కంగువా తర్వాత సూర్య చేయబోతున్న సినిమా విషయమై ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.
సూర్య గతంలో చేసిన ఆకాశమే నీ హద్దురా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాకు సుధ కొంగర దర్శకత్వం వహించారు. సూర్య మరోసారి సుధ కొంగర దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పడం.. వీరిద్దరి కాంబోలో సినిమా ను ప్రకటించడం నెల రోజుల క్రితమే జరిగిపోయింది.
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను 1965 లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్నారు. ఆకాశమే నీ హద్దురా సినిమా కూడా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా అనే విషయం తెల్సిందే.
సూర్య మరియు సుధ కొంగర కాంబోలో మరోసారి యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందబోతున్న సినిమా అవ్వడంతో కచ్చితంగా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి భారీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయంటూ వీరి కాంబో సినిమా కోసం వెయిట్ చేస్తున్న వారు చాలా నమ్మకంగా ఉన్నారు.
సూర్య 43వ చిత్రంగా రూపొందబోతున్న ఈ సినిమాలో కీలక పాత్రలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించబోతున్నాడు. హీరోయిన్ గా మలయాళ స్టార్ నజ్రియా కనిపించబోతుంది. ఇక సూర్య తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఇక ఈ సినిమాకి సంగీతాన్ని జీవి ప్రకాష్ అందించబోతున్నాడు. ఈ సినిమా జీవి ప్రకాష్ కి 100వ సినిమా అవ్వడం విశేషం.