Begin typing your search above and press return to search.

కంగువ.. బిజినెస్ ఏ రేంజ్ లో ఉందంటే..

తమిళ్ ఇండస్ట్రీ నుంచి కంగువ మూవీ ఫస్ట్ 1000 కోట్ల కలెక్షన్స్ అందుకునే సినిమాగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు, కానీ అది అంత ఈజీ కాదు.

By:  Tupaki Desk   |   26 July 2024 5:41 AM GMT
కంగువ.. బిజినెస్ ఏ రేంజ్ లో ఉందంటే..
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చివరిగా ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో సక్సెస్ లు అందుకున్నాడు. తరువాత వచ్చిన ఈటీ మూవీ ఆశించిన స్థాయిలో క్లిక్ కాలేదు. జై భీమ్ సినిమా హిట్ అయిన కూడా కమర్షియల్ గా భారీ కలెక్షన్స్ అయితే రాబట్టలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య మాస్ యాక్షన్ చిత్రాల డైరెక్టర్ శివ దర్శకత్వంలో కంగువ మూవీ చేస్తున్నారు. పాన్ వరల్డ్ చిత్రంగా మీ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

రెండు భాగాలుగా ఈ సినిమాని శివ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కంగువ పార్ట్ 1 మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి ఈ చిత్రం రాబోతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

సినిమా బిజినెస్ డీల్స్ కూడా ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రిలీజ్ రైట్స్ ఏకంగా 25 కోట్లు పలికాయంట. అంటే సూర్య కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ ఈ చిత్రంపై జరిగిందని చెప్పొచ్చు. కేరళ రైట్స్ 10 కోట్లకి సోల్డ్ అయినట్టు తెలుస్తోంది. అలాగే నార్త్ లో కూడా మంచి ఫ్యాన్సీ ధరకి హిందీ రిలీజ్ రైట్స్ ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కర్ణాటకలో రైట్స్ కోసం భారీగానే డీల్ కుదిరినట్లు సమాచారం.

కంగువ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ ఏకంగా 80 కోట్లకి కొనుగోలు చేసిందంట. ప్రస్తుతం సూర్య మార్కెట్ పరంగా చూసుకుంటే ఇది చాలా పెద్ద డీల్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా కంగువ మూవీపైన థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ కలిపి 350 కోట్ల బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలలో వినిపిస్తోంది. కోలీవుడ్ హైయెస్ట్ బిజినెస్ టార్గెట్ తోనే కంగువ థియేటర్స్ లోకి రాబోతోంది.

తమిళ్ ఇండస్ట్రీ నుంచి కంగువ మూవీ ఫస్ట్ 1000 కోట్ల కలెక్షన్స్ అందుకునే సినిమాగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు, కానీ అది అంత ఈజీ కాదు. టాక్ సాలీడ్ గా వస్తే తప్ప 500 కోట్లు రావు. ఇక వెయ్యి కోట్లు రావాలి అంటే హిందీలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావాలి. ఇక అదే జరిగితే సూర్య మార్కెట్, బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోవడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. తమిళ్, తెలుగు భాషలలో అయితే కంగువ మూవీ మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి.