సూర్య 'కంగువ' ఏడు దేశాల్లో?
కంగువ ఒక విజువల్ అద్భుతం కానుందన్న నమ్మకం అభిమానులకు ఉంది. చారిత్రక యుగం, వర్తమానం అనే రెండు యుగాల్లో కథ నడుస్తుంది.
By: Tupaki Desk | 30 April 2024 4:41 AM GMTసౌతిండియా స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం `కంగువ`. `దరువు` శివ దర్శకత్వం వహిస్తున్నారు. కంగువ టీజర్ ఇంతకుముందు విడుదలై సర్వత్రా ఉత్కంఠను కలిగించింది. ఈ అద్భుతమైన టీజర్‌లో సూర్య వేషధారణ, ఎంపిక చేసుకున్న కాన్వాస్.. కథాంశం.. కాస్ట్యూమ్స్ ఇలా ప్రతిదీ ఆశ్చర్యపరిచాయి. సృజనాత్మక ఆలోచన, వాస్తవికత, ఉత్తేజకరమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంకేతిక నైపుణ్యం వంటి అన్ని అంశాలు హాలీవుడ్ స్థాయికి ఎంతమాత్రం తగ్గలేదని ప్రశంసలు కురిసాయి. ప్రేక్షకులు టీజర్ వీక్షించాక సినిమాని థియేటర్లలో చూడాలని ఆసక్తిగా ఉన్నారు. ఇందులో ప్రతినాయకుడు బాబీ డియోల్ తో మైటీ వారియర్ సూర్య వార్ ని చూసేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం తాజాగా రివీలైంది. దీనిని మేకర్స్ అనేక ఒరిజినల్ లొకేషన్లను ఎంపిక చేసుకుని చిత్రీకరించారు.
కంగువ ఒక విజువల్ అద్భుతం కానుందన్న నమ్మకం అభిమానులకు ఉంది. చారిత్రక యుగం, వర్తమానం అనే రెండు యుగాల్లో కథ నడుస్తుంది. మేకర్స్ దీనిని యూరప్, గోవా సహా ప్రపంచవ్యాప్తంగా చాలా రియలిస్టిక్ ప్రదేశాలలో చిత్రీకరించారు. శ్రీలంకలో 60 రోజుల పాటు ఒక ప్రధాన షెడ్యూల్ చిత్రీకరించారు. చెన్నై, పాండిచ్చేరి శివార్లలో కొన్ని ప్రధాన సన్నివేశాలను రూపొందించారు. సూర్య పై ముఖ్యమైన సన్నివేశం ఇటీవల కొడైకెనాల్ అడవులు కేరళలో తెరకెక్కింది. తారాగణం సిబ్బందితో మూడు వారాల మారథాన్ షెడ్యూల్ గత ఏడాది అక్టోబర్‌లో బ్యాంకాక్‌లో చిత్రీకరించారు. ఇండియా, శ్రీలంక, బ్యాంకాక్, థాయ్ లాండ్ సహా పలు దేశాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కంగువ నిర్మాతలు యాక్షన్ సీక్వెన్స్‌ల మెరుగైన అవుట్‌పుట్ కోసం అలెక్సా సూపర్ 35 - అలెక్సా ఎల్‌ఎఫ్ కెమెరా వెర్షన్‌లను ఉపయోగించారు. రెండు విభిన్న యుగాల్లో సాగే ఈ చిత్రం 1000 సంవత్సరాల కథను కవర్ చేస్తుంది. ఈ రెండు కాలాదులలో వీక్షకులకు ప్రత్యేక ట్రీట్ అందేలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిసింది. ఇక ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పెర్‌ఫార్మెన్స్‌లు.. మునుపెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్‌లతో అసాధారణ దృశ్యమాన అనుభూతిని అందిస్తుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కంగువను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు స్టూడియో గ్రీన్ టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ చిత్రం 2024 ద్వితీయార్థంలో థియేటర్లలోకి రానుంది.
దర్శకుడు శివ, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ స్థాయికి ఎలివేట్ చేస్తున్నారు. దీనికోసం ఏకంగా 350 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ రాజీ అన్నదే లేకుండా పెట్టుబడులను సమకూరుస్తోంది.