Begin typing your search above and press return to search.

కంగువ : అసలు విషయాన్ని దాస్తున్నారు..!

తమిళ సినీ ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో కంగువ ఒకటి అనడంలో సందేహం లేదు

By:  Tupaki Desk   |   20 March 2024 7:36 AM GMT
కంగువ : అసలు విషయాన్ని దాస్తున్నారు..!
X

తమిళ సినీ ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో కంగువ ఒకటి అనడంలో సందేహం లేదు. తమిళ స్టార్‌ హీరో సూర్య హీరోగా యాక్షన్ చిత్రాలకు పేరు గాంచిన దర్శకుడు శివ భారీ బడ్జెట్‌ తో కంగువ సినిమాను బాహుబలి రేంజ్ లో రూపొందిస్తున్నాడు అంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇటీవల విడుదల అయిన పోస్టర్స్ మరియు టీజర్‌ సినిమా పై అంచనాలు భారీగా పెంచేశాయి. భారీ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు, సూర్య పాత్ర మరియు బాబీ డియోల్‌ కు సంబంధించిన సన్నివేశాలు సినిమా స్థాయిని అమాంతం పెంచడం ఖాయం అంటూ తమిళ మీడియా వారు తెగ కథనాలు రాస్తున్నారు.

ఈ సమయంలోనే టీజర్ లో మరియు పబ్లిసిటీ స్టఫ్ లో ఇప్పటి వరకు సినిమా కు సంబంధించి పీరియాడిక్‌ మూవీ అన్నట్లు చూపిస్తున్నారు. కానీ ఇదే సినిమాలో సమకాలీనంగా గోవా సన్నివేశాలు ఉంటాయి. ఆ విషయాన్ని గతంలో నిర్మాత అధికారికంగా ప్రకటించాడు. కానీ ఇప్పటి వరకు అలాంటి సన్నివేశాల తాలూకు లుక్ కానీ, షాట్స్ కానీ విడుదల చేయలేదు.

టీజర్‌ లో ఆ విషయాలను కాస్త అయినా టచ్‌ చేసి ఉంటే బాగుండేది. సినిమా పై ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయంను క్రియేట్‌ చేసిన టీజర్‌ లో ఆ విషయాలను చూపించక పోవడం వల్ల సినిమా చూసే సమయంలో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కంగువ విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్న కారణంగా మరో టీజర్ విడుదల చేయడంతో పాటు ట్రైలర్ విడుదల చేయాల్సి ఉంటుంది. అందులో ఇప్పటి వరకు దాచిన విషయాలను రివీల్‌ చేస్తూ మేకర్స్‌ సస్పెన్స్ కి తెర దించుతారేమో చూడాలి. ఆ విషయాన్ని అలాగే దాచి ఉంచి సినిమా ను విడుదల చేస్తే మాత్రం ప్రేక్షకులు కచ్చితంగా విభిన్నంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి.