కొత్త పోస్టర్: కంగువ ఢీ అంటే ఢీ
కంగువ టీజర్‌ను స్టూడియో గ్రీన్ బృందం ఆవిష్కరించినప్పటి నుండి.. ప్రేక్షకులలో ప్రకంపనలు సృష్టించింది.
By: Tupaki Desk | 14 April 2024 5:30 PM GMTసౌత్ స్టార్ హీరో సూర్య భారీ పాన్ ఇండియా విజయంపై కన్నేశాడు. అదే క్రమంలో అతడు `కంగువ` సినిమాని `దరువు` శివ- స్టూడియోగ్రీన్ తో కలిసి అత్యంత భారీగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. టెక్నికాలిటీస్ పరంగా ఇది హాలీవుడ్ స్టాండార్డ్స్ కి తగ్గకుండా టీమ్ జాగ్రత్తలు తీసుకుందని ఇంతకుముందు రిలీజైన టీజర్ చెబుతోంది.
కంగువ టీజర్‌ను స్టూడియో గ్రీన్ బృందం ఆవిష్కరించినప్పటి నుండి.. ప్రేక్షకులలో ప్రకంపనలు సృష్టించింది. ఈ టీజర్ జనాలను పూర్తిగా ఆశ్చర్యానికి గురిచేసింది. పరిశ్రమ వర్గాలు సహా అభిమానులు సాధారణ ప్రజలు సినీఔత్సాహికులు అందరూ దీని గురించి చర్చించుకునేలా చేసింది. తమిళ సూపర్ స్టార్ సూర్య మైటీ వారియర్‌గా .. బాబీ డియోల్ విలన్‌గా కనిపించడం ఉత్కంఠను పెంచింది. ఇప్పుడు జనంలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న క్యూరియాసిటీని మరింత పెంచడానికి మేకర్స్ తమిళ నూతన సంవత్సరం సందర్భంగా కంగువ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఇది నెక్ట్స్ లెవల్ ట్రీట్ అనడంలో సందేహం లేదు.
ఈ కొత్త పోస్టర్ లో సూర్య ద్విపాత్రలతో ఆశ్చర్యపరిచాడు. ఇది రెండు కాలాల్లో ఒకే వ్యక్తి రూపాలను ఆవిష్కరించింది. విభిన్న కాలాల్లోని విభిన్న వేషధారణల్లో సూర్య ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ఒక పాత్రలో శక్తివంతమైన గిరిజనుడిగా, మరొక పాత్రలో మోస్ట్ పవర్ ఫుల్ కార్పొరెట్ డాన్ గా అతడు కనిపిస్తున్నాడు. ఆధునిక సమాజంతో గిరిజన సమాజం కనెక్షన్ ఏమిటన్నది తెరపైనే చూడాల్సి ఉంటుంది. అడవిలో శక్తియుక్తులున్న గిరిజనుడి పాత్ర కత్తిని చేత పడితే, మోడ్రన్ బాస్ పాత్ర ఏకంగా మెషీన్ గన్ తో బరిలో దిగింది. చూస్తుంటే భీకర పోరాటాలు రసవత్తరంగా సాగుతాయని ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది. కొత్త పోస్టర్ నిజంగా మరింత నిరీక్షణను పెంచిందనడంలో సందేహం లేదు. ``గతం మరియు వర్తమానం ఎక్కడ ఢీకొంటే అక్కడ కొత్త భవిష్యత్తు... ప్రపంచవ్యాప్తంగా కంగువ 2024లో విడుదలవుతుంది.. హ్యాపీ తమిళ్ న్యూ ఇయర్`` అని ఈ పోస్ట్‌కి మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు.
కంగువ హ్యూమన్ ఎమోషన్స్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్సెస్.. భారీ స్థాయిలో మునుపెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను అలరించనుంది. పచ్చని అటవీ ప్రాంతం, గ్రామీణ వాతావరణంతో సరికొత్త విజువల్ ఫెస్ట్ ని అందిస్తుంది. ఈ చిత్రానికి వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ అందించగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. స్టూడియో గ్రీన్ ఈ చిత్రాన్ని 2024 మిడ్ లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్‌లతో చర్చిస్తోంది.