Begin typing your search above and press return to search.

కంగువ ప్రమోషన్స్ పీక్స్ ప్లానింగ్..!

సూర్య సెప్టెంబర్ మంత్ మిడిల్ నుంచి కంగువ ప్రమోషన్స్ కోసం టైం కేటాయిస్తారని తెలుస్తుంది. కంగువ సినిమాకు పోటీగా సూపర్ స్టార్ వేట్టయ్యాన్ సినిమా వస్తుంది.

By:  Tupaki Desk   |   23 July 2024 4:31 AM GMT
కంగువ ప్రమోషన్స్ పీక్స్ ప్లానింగ్..!
X

కోలీవుడ్ స్టార్ సూర్య తన కెరీర్ లోనే కంగువ లాంటి సినిమాను తీయడం ఇదే మొదటిసారి. సూర్య ప్రధాన పాత్రలో శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కంగువ. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ లో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దసరా బరిలో దించేలా అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. కంగువ సినిమా సూర్య ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందిస్తుందని సినిమాలో కొన్ని విజువల్స్ అయితే మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయని చిత్రయూనిట్ చెబుతున్నారు.

కంగువ సినిమా రిలీజ్ టైం చాలా ఉన్నా సరే ప్రమోషన్స్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారట. సూర్య సెప్టెంబర్ మంత్ మిడిల్ నుంచి కంగువ ప్రమోషన్స్ కోసం టైం కేటాయిస్తారని తెలుస్తుంది. కంగువ సినిమాకు పోటీగా సూపర్ స్టార్ వేట్టయ్యాన్ సినిమా వస్తుంది. ఆ సినిమాను ఢీ కొట్టాలంటే సినిమాకు కావాల్సినంత ప్రమోషన్స్ ఉండాలి. కంగువ సినిమా ప్రమోషన్స్ ని కూడా మేకర్స్ భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కాబట్టి హిందీ బెల్ట్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తున్నారు. కంగువ సినిమా లో సూర్య డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తారని తెలుస్తుంది. సినిమా నట విశ్వరూపం చూపించిన ఈ సినిమా పై అభిమానుల అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న కంగువ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడని తెలుస్తుంది.

అనుకున్న రేంజ్ లో సినిమా ఉంటే తప్పకుండా కంగువ కోలీవుడ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందని అంటున్నారు. అందుకే సినిమా చూసేందుకు ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ పెంచేలా ప్రమోషన్స్ ని పీక్స్ లో ప్లాన్ చేస్తున్నారట. తప్పకుండా కంగువ తో సూర్యకు ఒక సూపర్ హిట్ పడితే ఫ్యాన్స్ మాత్రం సూపర్ ఖుషి అవుతారని చెప్పొచ్చు. సూర్య ఈ సినిమాతో పాటుగా కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా నుంచి నేడు సూర్య బర్త్ డే సందర్భంగా ఒక గ్లింప్స్ వదిలారు. కార్తీక్ మార్క్ మూవీగా సూర్య 44 వస్తుందని శాంపిల్ చూపించేశారు.