'కంగువ' గుండెల్లో 'తంగలన్' ఈటె
అది కూడా ఒకే బ్యానర్ లో రూపొందించిన రెండు భారీ చిత్రాలను ఇంత గట్సీగా గ్యాప్ లేకుండా రిలీజ్ చేయాలనే ఆలోచన రకరకాల విశ్లేషణలకు తావిస్తోంది.
By: Tupaki Desk | 16 Jan 2024 4:30 PM GMTఇంతకుముందే సూర్య కంగువ సెకండ్ పోస్టర్ ని విడుదల చేసిన స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలవుతుందని స్పష్ఠతనిచ్చింది. ఇంతలోనే ఇప్పుడు ఇదే బ్యానర్ లో రూపొందుతున్న తంగలన్ ని కూడా ఏప్రిల్ లోనే విడుదల చేస్తున్నామని ప్రకటించడం ఆశ్చర్యపరిచింది.
ఒకే సీజన్ లో ఇద్దరు క్రేజీ తమిళ అగ్ర హీరోలు నటించిన ప్రయోగాత్మక సినిమాలను ఒకదానితో ఒకటి పోటీకి దించడం నిజంగానే షాకిస్తోంది. అది కూడా ఒకే బ్యానర్ లో రూపొందించిన రెండు భారీ చిత్రాలను ఇంత గట్సీగా గ్యాప్ లేకుండా రిలీజ్ చేయాలనే ఆలోచన రకరకాల విశ్లేషణలకు తావిస్తోంది.
స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ హౌస్, నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా తంగలన్ - కంగువ చిత్రాలను భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పా రంజిత్ దర్శకత్వం వహించిన పీరియాడికల్ డ్రామా తంగలన్ లో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించారు. టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇటీవల పొంగల్ సందర్భంగా విడుదల తేదీని ప్రకటించడంతో ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. విడుదల తేదీని ప్రకటిస్తూ, మేకర్స్ ఇలా రాశారు, "చరిత్ర రక్తం మరియు బంగారంతో రాయడానికి వేచి ఉంది #తంగళన్ ఏప్రిల్ 2024 నుండి #HappyPongal #HappyMakarSankranti... అని వివరాలు అందించారు.
గతంలో ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 1870లు 1940ల మధ్య జరిగిన కథను తంగలన్ లో చూపించనున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. గత ఏడాది మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఇది సినిమా పాత్రల పరిచయం ఆకట్టుకుంది. చియాన్ విక్రమ్ గిరిజన నాయకుడి పాత్రలో కనిపించగా కఠినమైన లుక్ ఆకర్షించింది. ఈ టీజర్‌లో పశుపతి, పార్వతి, మాళవిక మోహనన్‌లు సినిమాలో స్టార్ కాస్ట్‌గా కనిపించనున్నారు. స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్‌పై కెఇ జ్ఞానవేల్ రాజా మరియు నీలం ప్రొడక్షన్స్‌పై పా రంజిత్ నిర్మించిన తంగలన్ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం .. కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి సెల్వ ఆర్కే ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. చియాన్ విక్రమ్ గత సంవత్సరం పొన్నియన్ సెల్వన్: పార్ట్ 2లో కనిపించాడు. త్వరలో చియాన్ 62, మహావీర్ కర్ణలో నటిస్తున్నాడు.
సూర్యతో ప్రయోగం:
మరోవైపు సూర్య ద్విపాత్రాభినయంతో భూత భవిష్యత్ వర్తమాన కాలాల నేపథ్యంలో రూపొందించిన కథతో కంగువ టైటిల్ తో దరువు శివ భారీ ప్రయోగం చేస్తున్నాడు. స్టూడియో గ్రీన్ సంస్థ రాజీ అన్నదే లేకుండా దీనిపై పెట్టుబడులు పెడుతోంది. ఈ సినిమాని అత్యంత భారీగా విడుదల చేయనుండగా, ఇప్పుడు ఒకే నెలలో చియాన్ విక్రమ్, సూర్య పోటీపడుతుండడం ఆశ్చర్యపరుస్తోంది. రెండు భారీ చిత్రాల క్లాష్ తో థియేటర్ల పరంగా ఎదురయ్యే చిక్కులపైనా విశ్లేషణ సాగుతోంది.