మనదంతా సర్కారు చదువే..ఇంగ్లీష్ రాదు!
అవును ఈ విషయం ఆయనే స్వయంగా రివీల్ చేసాడు. అందుకు ప్రభుత్వ బడిలో చదవడమే కారణం అంటున్నాడు. ఏడవ తరగతి వరకూ సర్కారు బడిలోనే చదువు సాగిందిట.
By: Tupaki Desk | 20 Dec 2024 5:25 PM GMTకన్నడ స్టార్ ఉపేంద్ర గురించి పరిచయం అవసరం లేదు. నటుడిగా అతడికంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కన్నడ నటుడైనా తెలుగు అభిమానులు అతడిని ఎంతగానో అభిమానిస్తారు. సినిమాలు తగ్గినా? అతడిపై తెలుగు అభిమానుల అభిమానం మాత్రం ఎప్పటికీ తగ్గదు. అతడికంటూ ప్రత్యేకమైన ప్యాన్ బేస్ ఉందిక్కడ. మరి అలాంటి నటుడుకి ఇంగ్లీష్ రాదు? అంటే నమ్ముతారా? వచ్చిరాని ఇంగ్లీష్ తోనే మ్యానేజ్ చేస్తున్నాడని ఎంత మందికి తెలుసు.
అవును ఈ విషయం ఆయనే స్వయంగా రివీల్ చేసాడు. అందుకు ప్రభుత్వ బడిలో చదవడమే కారణం అంటున్నాడు. ఏడవ తరగతి వరకూ సర్కారు బడిలోనే చదువు సాగిందిట. దీంతో చిన్న వయసులో ఇంగ్లీష్ కు సరైన బీజం పడలేదన్నాడు. మరి తెలుగు బాగానే మాట్లాడుతున్నారు. ఈ భాష ఎలా నేర్చుకున్నారు? అంటే తెలుగు వాళ్లతో ఇంటరాక్షన్ ఎక్కువగా ఉండటం వల్ల భాషపై కాస్త పట్టు సాధించానన్నారు.
తన చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్లు ఉంటే ? ఆ భాష కూడా పరిపూర్ణంగా నేర్చుకునేవాడినేమో అన్నారు. మరి అలాంటి ఉపేంద్ర ఇండస్ట్రీలో ఎలా నెట్టుకొచ్చాడు? అంటే ఉప్పీ కన్నడ పరిశ్రమలో చాలా కష్టాలు పడ్డాడు. అవమానాలు ఎదుర్కున్నాడు. సెట్స్ లో లైట్ బోయ్ గా ప్రయాణం మొదలు పెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు. ఈ క్రమంలో పైనున్న వాళ్లు ఎంతో మంది అతడిని అవమానించారు.
తినే తిండి దగ్గర సైతం అవమానానికి గురైన సందర్భాన్ని ఓ సమయంలో గుర్తుచేసుకున్న సంగతి తెలిసిందే. ఉపేంద్ర ఇండస్ట్రీలో అలా ఎదిగిన నటుడు. నేడు హీరోగా, దర్శకుడిగా సత్తా చాటుతున్నాడు. ఆయన హీరోగా నటించిన `యూఏ` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ మధ్య హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాడు.