బుల్లితెర నటి.. చీరలో హీటెక్కించే అందం!
అంతే కాదు, సీరియల్స్‌లో సంపాదించిన క్రేజ్‌ను మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో తనకు ఓ ప్రత్యేకమైన ప్లేస్ సంపాదించుకోవడానికి ఉపయోగించుకుంటోంది.
By: Tupaki Desk | 21 March 2025 3:21 AMటెలివిజన్ స్క్రీన్ మీద ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటీమణుల్లో జ్యోతి పూర్వాజ్ ఒకరు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మడు తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర ద్వారా జనాలకు పరిచయమైంది. గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి మేడమ్ పాత్ర పోషించి యావత్తు టీవీ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. తక్కువ కాలంలోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, సీరియల్‌తోనే కాకుండా వెబ్ సిరీస్, సినిమాల వైపూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
అంతే కాదు, సీరియల్స్‌లో సంపాదించిన క్రేజ్‌ను మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో తనకు ఓ ప్రత్యేకమైన ప్లేస్ సంపాదించుకోవడానికి ఉపయోగించుకుంటోంది. భర్త పూర్వాజ్ దర్శకత్వంలో వచ్చిన శుక్ర, మాటరాని మౌనమిది చిత్రాల్లో నటించి తన రేంజ్ చూపించింది. తన ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూనే కెరీర్‌లో ముందుకు సాగుతోంది.
పెళ్లి తర్వాత కెరీర్ స్లో అవుతుందనే భయాలను కాదనుకుని, మరింత బోల్డ్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు గ్లామరస్ ట్రీట్స్ ఇస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఈ లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. పార్కింగ్ ఏరియాలో కార్ దగ్గర స్టైలిష్ లుక్‌లో స్టిల్స్ ఇచ్చిన జ్యోతి, అందంగా ఉండటమే కాదు, మోడరన్ అండ్ ట్రెడిషనల్ మిక్స్‌లో ఎట్రాక్ట్ చేసేలా ఫోజు ఇచ్చింది.
లైట్ బ్లూ కలర్ శారీ, అందంగా మెరిసే పచ్చటి బ్లౌజ్‌లో ఆమె సింప్లిసిటీతో కూడిన హొయలు చూపించేసింది. చేతిలో కీ హోల్డర్ పట్టుకుని, అటు కార్ వైపు వాలి స్టన్నింగ్ లుక్ ఇచ్చిన స్టైల్ అందరినీ ఇంప్రెస్ చేసింది. మరీ ముఖ్యంగా, ఆమె ఇచ్చిన క్యాప్షన్ – "ఇది గమనించబడటం గురించి కాదు, గుర్తుంచుకోవడం గురించి." అంటూ చెప్పిన విధానం అభిమానులను ఫిదా అయ్యేలా చేసింది. ఫ్యాన్స్ జ్యోతి లుక్స్‌పై సూపర్ రెస్పాన్స్ ఇస్తున్నారు. "జగతి మేడమ్.. ఈ స్టిల్ స్టన్నింగ్" అంటూ కామెంట్లు పెడుతున్నారు.