Begin typing your search above and press return to search.

నా పెళ్లి దేవుడు చేతుల్లోనే అంటూ న‌టి!

కానీ ఆమె జీవితం మ‌రోలా ఉంద‌ని తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం చాందినికి 41 ఏళ్లు. ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు అన్న సంగ‌తిని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసారు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 6:59 AM GMT
నా పెళ్లి దేవుడు చేతుల్లోనే అంటూ న‌టి!
X

క‌న్న‌డ సంచ‌ల‌నం ఉపేంద్ర న‌టించిన 'ఏ' సినిమా అప్ప‌ట్లో ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. 25 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఈ చిత్రాన్ని తెలుగులో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టి యువ‌తికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం అభిమానుల్లో ఉంది. ఇందులో ఉపేంద్ర‌కు జోడిగా చాందిని న‌టించింది. ఆమె ఈ సినిమా త‌ర్వాత పెద్ద సినిమాలు చేయ‌లేదు. పాత హీరోయిన్ కాబ‌ట్టి మ‌ళ్లీ ఇప్పుడు ట‌చ్ లోకి రావ‌డం కూడా క‌ష్ట‌మే. పెళ్లి చేసుకుని, వేరే దేశంలో పిల్ల‌లు, ఫ్యామిలీతో సంతోషంగా ఉంటార‌నుకున్నారంతా.

కానీ ఆమె జీవితం మ‌రోలా ఉంద‌ని తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం చాందినికి 41 ఏళ్లు. ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు అన్న సంగ‌తిని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసారు.' నేను చ‌దువుకుంటోన్న రోజుల్లోనే ఈ సినిమాలో ఛాన్స్ వ‌చ్చింది. ఆ పాత్ర కోసం చాలా మంది పోటీ ప‌డ్డారు. చాలా మంది ఆడీష‌న్స్ ఇచ్చారు. కానీ నా ఫోటోలు తెలిసిన వారి నుంచి ఉపేంద్ర‌కు వెళ్లాయి. ఆయ‌న వెంట‌నే న‌న్ను సెల‌క్ట్ చేసారు.

అప్ప‌టికీ నాకు ఎలాంటి అనుభ‌వం కూడా లేదు. ఆ పాత్ర‌కి అనుభ‌వం అవస‌రం లేద‌ని, నేచుర‌ల్ గా చెప్పింది చేస్తే చాలు అని ఉప్పీసార్ న‌న్ను తీసుకున్నారు. అనుకున్న‌ట్లే ఆ పాత్ర బాగా పండింది. నాకు మంచి పేరొచ్చింది. ఇక పెళ్లి విష‌యానికి వ‌స్తే ..వివాహ బంధంపై నాకు మంచి న‌మ్మ‌కం ఉంది. నా పెళ్లి గురించి చాలా మంది అడుగుతున్నారు. కానీ మ‌న చేతుల్లో ఏదీ లేద‌ని న‌మ్ముతాను.

దాన్ని దేవుడు నిర్ణ‌యించాలి. పెళ్లి అనేది ఓ అద్భుతం. అందుకు స‌మయం రావాలి. ప్రేమ‌తో కూడిని అరేంజ్ మ్యాచ్ లు అయితే బాగుంటాయి. క‌త‌ల‌త‌ల‌కు ఆస్కారం ఉండ‌దు. ఒక‌వేళ చోటు చేసుకున్నా స‌ర్దుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి' అని అన్నారు.