ఆ స్టార్ హీరో గొప్పతనం అదే!
శాండిల్ వుడ్ సూపర్ స్టార్ అతను. రాజ్ కుమార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన శివరాజ్ ఓ లెజెండ్ లా ఎదిగారు
By: Tupaki Desk | 21 Aug 2023 7:26 AMకన్నడ సంచలనం శివరాజ్ కుమార్ స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. శాండిల్ వుడ్ సూపర్ స్టార్ అతను. రాజ్ కుమార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన శివరాజ్ ఓ లెజెండ్ లా ఎదిగారు. కోట్లాది అభిమానించే స్టార్ అతను. కన్నడతో పాటు కోలీవుడ్..టాలీవుడ్..మాలీవుడ్ లోనూ శివరాజ్ కి ప్రత్యేకమైన అభిమాను లున్నారు. నటుడిగా కంటే వ్యక్తిగతంగా ఆయన్ని ఆభిమానించే వారెంతో మంది. సేవా కార్యక్రమాల్లో ఆయన చురుకుదనం కోట్లాది మందికి దగ్గర చేసింది. ఆయన సింప్లిసిటీ కి ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు.
తాజాగా మరోసారి తనలో నిరాడంబరతను చాటు కున్నారు. సాధరణంగా ఓస్టార్ హీరోని మరో స్టార్ ప్రశంసించడం అన్నదే చాలా రేర్ గా జరుగుతోంది. ఇప్పుడు అప్ డేట్ అయ్యారు కాబట్టి! ఈగోలు..ఇతర వ్యవహారాలు పక్కనబెట్టి కలిసి పనిచేస్తున్నారుగానీ..ఒకప్పుడు పరిశ్రమలో హీరోలు ఎలా ఉండేవారో తెలిసిందే. ఒకరి సినిమాల్లో ఒకరు నటించే వారు కాదు. ఒకరి సినిమా వేడుకకు మరో హీరో గెస్ట్ గా వచ్చే వాళ్లు కాదు. ఈగో ప్యాక్టర్ మీద పరిశ్రమలు నడిచేవి. ఇప్పుడవన్నీ కనుమరుగైపోయాయి అనుకోండి.
అలాంటి రోజుల్లో కూడా శివరాజ్ కుమార్ హీరోలతో మెలిగే విధానం..నిరాడంబరత అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నారని తాజాగా మరో సన్నివేశం రుజువు చేస్తుంది. కోలీవుడ్ హీరోలు ధనుష్..అజిత్ గురించి తన మనసులో మాటలు బయట పెట్టి రియల్ హీరో అనిపించారు. శివరాజ్ కుమార్ అభిమానించే హీరో తల అజిత్ అట. అతనితో కలిసి ఒక సినిమా అయినా చేయాలని ఉందని తెలిపారు. తన మనసుకు దగ్గరైన వ్యక్తుల్లో అజిత్ ని ఒకరిగా చెప్పుకొచ్చారు.
అలాగే ధనుష్ కి వీరాభిమాని అట. ధనుష్ నటించిన ప్రతీ సినిమా తప్పక చూస్తారుట. ధనుష్ లో తనని తాను చూసుకుంటారుట. `కెప్టెన్ మిల్లర్` లో ధనుష్ తో కలిసి నటించే అవకాశం వచ్చిందని ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. ఇలా ఓ స్టార్ హీరో పరభాష నటుల గురించి గొప్పగా మాట్లాడటం అన్నది శివరాజ్ కుమార్ వ్యక్తిత్వానికి..మనస్తత్వానికి నిదర్శనం. శివరాజ్ కుమార్ వయసు 60 ఏళ్లు. అయినా ప్రతిభకి వయసు కొలమానం కాదని భావించే నటుడాయన.