Begin typing your search above and press return to search.

కన్నప్ప పై ట్రోల్ చేస్తే.. నోట మాట రాకుండా చేసిన నటుడు

మానవుడిగా జన్మించి భగవంతుడిని ప్రసన్నం చేసుకున్న భక్త కన్నప్ప కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 March 2025 6:16 PM IST
Did Raghu babu gave warning to trolls
X

ఫాంటసీ మైథలాజికల్ జానర్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘కన్నప్ప’పై మేకర్స్ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్ చేస్తున్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ‘మహాభారతం’ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మానవుడిగా జన్మించి భగవంతుడిని ప్రసన్నం చేసుకున్న భక్త కన్నప్ప కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో, హై స్టాండర్డ్ విజువల్స్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఏప్రిల్ 25న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ రుద్రుని పాత్రలో మెరవనుండగా, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, శరత్‌కుమార్, కబీర్ బేది లాంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంచు మోహన్‌బాబు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇక, ఈ భారీ తారాగణంతో పాటు, న్యూజిలాండ్‌లో 9 వేల ఎకరాల ఫాం ల్యాండ్‌ను షూటింగ్ కోసం 6 నెలల పాటు అద్దెకు తీసుకున్నారట.

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌లు సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను పెంచాయి. ముఖ్యంగా విజువల్ ప్రెజెంటేషన్, సంగీతం, కథపై ఉన్న నమ్మకం సినిమాకు బజ్‌ను పెంచుతోంది. ప్రభాస్ లుక్‌తో పాటు మంచు విష్ణు పోషించిన కన్నప్ప పాత్రకు సంబంధించి వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే సినిమా గురించి జరుగుతున్న ప్రచారంలో ట్రోల్స్ కూడా చోటుచేసుకున్నాయి.

ఇక ఇటీవల రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన ఓ సమావేశంలో నటుడు రఘుబాబు ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించారు. ‘‘ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్స్ చేస్తే శివుడి ఆగ్రహానికి గురవుతారు. శాపం తగులుతుంది. ట్రోల్ చేస్తే ఇక ఫినిష్‌..గుర్తుపెట్టుకోండి. 100శాతం కచ్చితంగా చెబుతున్నా. ట్రోల్‌ చేస్తే ఇక ఫినిష్‌’’ అంటూ స్పష్టంగా హెచ్చరించారు.

ఈ కామెంట్స్ తో ఆయన బాగా వైరల్ అవుతూ ట్రోలింగ్ చేస్తున్న వారిని ఆలోచనలో పడేసేలా చేశారు. రఘుబాబు కామెంట్స్ తో 'కన్నప్ప' టీమ్ ఆత్మవిశ్వాసం ఎంతగా ఉందో అర్థమవుతోంది. ఇక ఈ ఈవెంట్‌లో మంచు విష్ణు మాట్లాడుతూ, ‘‘నేను మాట్లాడే ప్రతి మాటలో నుంచి ఒక మాట మాత్రమే కట్ చేసి ట్రోల్ చేయాలనుకునే వాళ్లున్నారు. కానీ ప్రజలు తెలివిగా ఉన్నారు. వారు అసలు వీడియో చూస్తారు. నిజమెంటో అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత ఆ ట్రోల్స్‌ను ‘న్యూసెన్స్‌’గా పరిగణిస్తారు’’ అంటూ శాంతంగా సమాధానం ఇచ్చారు.

సోషల్ మీడియా ట్రోల్స్‌ను పెద్దగా పట్టించుకోనని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు. నిజమైన ప్రేక్షకులు మా కష్టాన్ని అర్థం చేసుకుంటారు అంటూ మంచు విష్ణు చెప్పిన వ్యాఖ్యలు సినిమాపై నమ్మకాన్ని పెంచుతున్నాయి. ఇక ప్రభాస్, మోహన్‌లాల్ లాంటి తారలు ఉన్న ఈ సినిమాను, ఇండియన్ మైథాలజికల్ సినిమాల్లో ప్రత్యేక స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంగా ప్రేక్షకులు చూడాలని మంచు విష్ణు కోరారు.