Begin typing your search above and press return to search.

కన్నప్ప.. ఇదే సరైన టైమ్..

24 ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డైలాగ్ కింగ్ మోహన్ బాబు.. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Feb 2025 9:00 PM IST
కన్నప్ప.. ఇదే సరైన టైమ్..
X

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. మహాశివుడు పరమ భక్తుడు కన్నప్ప జీవిత ఆధారంగా సినిమాను ముఖేష్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డైలాగ్ కింగ్ మోహన్ బాబు.. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పాన్ ఇండియా లెవెల్ లో అనేక మంది నటీనటులు ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, మధుబాల, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ తదితరులు.. గెస్ట్ రోల్స్ లో సినిమాలో సందడి చేయనున్నారు.

అయితే పాన్ ఇండియా లెవెల్ లో ఏప్రిల్ 25వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. రీసెంట్ గా వేగం పెంచారు. శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి అక్కడ టీజర్ ప్లే చేశారు. మార్చి 1వ తేదీన టీజర్ ను రిలీజ్ చేస్తామని తెలిపారు.

ఆ తర్వాత నిన్న ముంబైలో ఈవెంట్ నిర్వహించారు. టీజర్ ను లాంఛ్ చేశారు. ఇప్పుడు మరిన్ని కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. అయితే రిలీజ్ కు ఇంకా 45 రోజుల సమయం ఉంది. దీంతో మేకర్స్.. ఆడియన్స్ లో బజ్ భారీగా క్రియేట్ అయ్యేలా చేయాలి. వరుస ఈవెంట్లు, ఇంటర్వ్యూలు సహా అన్నీ గ్రాండ్ గా నిర్వహించాలి.

మూవీలో స్టార్ క్యాస్టింగ్ అంతా గెస్ట్ రోల్స్ చేస్తుండడంతో.. వేరే లెవెల్ లో అంచనాలు క్రియేట్ చేయాల్సిందే. కానీ ఇప్పుడు అనుకున్నంత ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అవ్వలేదు. దీంతో మంచు విష్ణు దానిపై ఫోకస్ చేయాలని, ఇదే సరైన టైమ్ అని అంటున్నారు నెటిజన్లు. ఇప్పటికే కన్నప్ప స్టోరీ అందరికీ తెలుసని, కాబట్టి థియేటర్లకు అందరినీ రప్పించేలా చేయాలని చెబుతున్నారు.

ఓల్డ్ వెర్షన్ లో చాలా మార్పులు చేశామని చెబుతున్న విష్ణు.. దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. నార్త్ లో బజ్ క్రియేట్ చేస్తే తిరుగుండదని అంటున్నారు. రీసెంట్ గా మహాకుంభమేళా జరగడంతో.. ఆ ఆధ్యాత్మిక సెంటిమెంట్ ను ఉపయోగించుకోవాలని చెబుతున్నారు. అన్నింటికీ సరైన టైమ్ ఇదేనని.. ఆడియన్స్ కు భారీగా రీచ్ అయితే ఇంకా తిరుగులేదని అంటున్నారు. మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.