Begin typing your search above and press return to search.

కన్నప్ప 'మహాదేవ శాస్త్రి' - మోహన్ బాబు పవర్ఫుల్ వైబ్!

ఈ గ్లింప్స్‌లో “ఢమ ఢమ ఢమ ఢమ విస్పులింగ.. ధిమి ధిమి ధిమి ధిమి ఆత్మలింగ” అంటూ సాగే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ గూస్ బంప్స్ అనేలా ఉంది.

By:  Tupaki Desk   |   19 March 2025 9:19 PM IST
కన్నప్ప మహాదేవ శాస్త్రి - మోహన్ బాబు పవర్ఫుల్ వైబ్!
X

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘కన్నప్ప’ కూడా ఒకటి. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. శివ భక్తుడు కన్నప్ప కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. హై రేంజ్ విజువల్స్, అద్భుతమైన స్టోరీ టెల్లింగ్, గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవల విడుదలైన టీజర్‌తోనే మంచి హైప్ తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే, నేడు లెజెండరీ నటుడు మంచు మోహన్‌బాబు పుట్టినరోజు. ఈ ప్రత్యేక సందర్భాన్ని మరింత ప్రత్యేకం చేస్తూ ‘కన్నప్ప’ మూవీ టీమ్ ఆయనకు సంబంధించిన ఓ స్పెషల్ లుక్‌ను అలాగే పాత్రకు సంబంధించిన లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో మహాదేవ శాస్త్రి పాత్రలో నటిస్తున్న మోహన్‌బాబును చూపించే గ్లింప్స్ అభిమానులను ఫిదా చేస్తోంది. త్రిశూలాలతో నిండిన బ్యాక్‌గ్రౌండ్‌లో నడుచుకుంటూ వస్తున్న ఆయన లుక్, పవర్ఫుల్ హావభావాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ఈ గ్లింప్స్‌లో “ఢమ ఢమ ఢమ ఢమ విస్పులింగ.. ధిమి ధిమి ధిమి ధిమి ఆత్మలింగ” అంటూ సాగే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ గూస్ బంప్స్ అనేలా ఉంది. పవర్‌ఫుల్ లిరిక్స్, గ్రాండ్ విజువల్స్, మోహన్‌బాబు ఎనర్జీని చూసిన ప్రేక్షకులు ఈ సినిమాపై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ లిరికల్ గ్లింప్స్‌ను తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయడం విశేషం. విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది.

‘కన్నప్ప’లో స్టార్ కాస్టింగ్ కూడా భారీ స్థాయిలో ఉండటం మరో ప్రత్యేకత. రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విష్ణు మంచు కెరీర్‌లోనే అత్యంత ముఖ్యమైన సినిమాగా నిలిచే అవకాశం ఉంది. దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ మేకింగ్ హై రేంజ్‌లో ఉండబోతోందని సమాచారం.

ఈ భారీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మొదట్లో ట్రోలింగ్‌కు గురైన ఈ సినిమా, ఒక్కొక్క అప్‌డేట్‌తో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘ఒం నమః శివాయ’ పాటతో ఇప్పటికే శివ భక్తులకు కనెక్ట్ అయ్యింది. తాజాగా మోహన్‌బాబు పాత్రకు సంబంధించిన సాంగ్ మరింత హైప్‌ను తీసుకొచ్చింది. మరి విడుదల అనంతరం ఈ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి.