'కన్నప్ప'లో సూపర్ స్టార్ లుక్ రివీల్‌కి ముహూర్తం ఫిక్స్
మోహన్‌లాల్‌ను వెనుక నుంచి చూపించిన పోస్టర్‌ను విడుదల చేశారు. బాణం ధరించి ఉన్న మోహన్ లాల్ లుక్ కోసం ఆసక్తిగా ఉన్నామని ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 14 Dec 2024 1:42 PM GMTమంచు ఫ్యామిలీ వివాదం ఒకవైపు కొనసాగుతున్నా మరో వైపు కన్నప్ప వర్క్‌కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. కన్నప్ప సినిమా కోసం మంచు ఫ్యామిలీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మంచు విష్ణు గత చిత్రాల మాదిరి కాకుండా ఈ సినిమా బాగుంటుంది అంటూ రెగ్యులర్ ఆడియన్స్ సైతం నమ్మకంతో ఉన్నారు. కన్నప్ప సినిమాను భారీ స్టార్ కాస్ట్‌తో నింపేసిన మంచు మనోజ్ భారీగా ఖర్చు చేసి సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. కన్నప్ప సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
కన్నప్ప సినిమాలో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు, ప్రభాస్, మోహన్‌లాల్, శతర్ కుమార్, అక్షయ్ కుమార్, నయనతారలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఏ పాత్రలో కనిపిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో చేసిన పాత్ర ఏంటా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎదురుచూపులకు తెర పడుతుంది. కన్నప్ప నుంచి మోహన్ లాల్ లుక్‌ను ఈనెల 16న విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడటంతో ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మోహన్‌లాల్‌ను వెనుక నుంచి చూపించిన పోస్టర్‌ను విడుదల చేశారు. బాణం ధరించి ఉన్న మోహన్ లాల్ లుక్ కోసం ఆసక్తిగా ఉన్నామని ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున విడుదల చేసే విధంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గ్రాఫిక్స్ విషయంలో హాలీవుడ్ టీంతో వర్క్ చేయిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసిన వీఎఫ్‌ఎక్స్ సంస్థలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. కన్నప్ప సినిమాలో మంచు విష్ణు పాత్రను ఇప్పటికే రివీల్ చేసిన విషయం తెల్సిందే.
సినిమా విడుదలకు ఇంకా అయిదు నెలల సమయం ఉన్న కారణంగా మెల్ల మెల్లగా ఒక్కో పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేస్తూ ఇప్పటి నుంచే సినిమాపై అంచనాలు పెంచే విధంగా ప్రమోషన్ చేస్తున్నారు. సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి సినిమా టీజర్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి మంచు విష్ణు రచయితగా వ్యవహరించడం విశేషం. సినిమాను విదేశాల్లోనూ భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.