Begin typing your search above and press return to search.

కన్నప్ప హిందీ ఈవెంట్.. అక్షయ్ స్టైలిష్ వైబ్స్!!

టాలీవుడ్ మంచు విష్ణు లీడ్ రోల్ లో మైథాలజికల్ సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామా కన్నప్ప గ్రాండ్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Feb 2025 9:24 AM GMT
కన్నప్ప హిందీ ఈవెంట్.. అక్షయ్ స్టైలిష్ వైబ్స్!!
X

టాలీవుడ్ మంచు విష్ణు లీడ్ రోల్ లో మైథాలజికల్ సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామా కన్నప్ప గ్రాండ్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. శివ భక్తుడైన కన్నప్ప జీవితాధారంగా దర్శకుడు, మహాభారతం ఫేమ్ ముకేష్ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. అలాగే విష్ణు కొడుకు అవ్రామ్‌, కుమార్తెలు ఆరియానా, వివియానా కూడా సినిమాలో భాగమయ్యారు.


అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై సినిమాను మంచు మోహన్ బాబు నిర్మిస్తూ నటిస్తున్నారు కూడా. ఆయనతోపాటు ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే వారికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ ను మేకర్స్ రివీల్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఏప్రిల్ 25వ తేదీన కన్నప్ప మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే మంచు విష్ణు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే బెంగళూరు, చెన్నైలో ప్రెస్ మీట్స్ నిర్వహించారు.

రీసెంట్ గా శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించింది కన్నప్ప టీమ్. కాళహస్తీశ్వరుడిని దర్శించుకుని టీజర్ ను అక్కడ ప్లే చేసింది. సినిమా కోసం ఎన్నో నెలలుగా కష్టపడి పనిచేస్తున్నామని, టీజర్‌ ను మీ అందరికీ చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని విష్ణు తెలిపారు. మార్చి 1న టీజర్‌ విడుదలవుతుందని అన్నారు.

ఇప్పుడు ముంబైలో మీడియా మీట్ ఏర్పాటు చేశారు. కన్నప్ప టీజర్ ప్రోమోను అక్కడ రిలీజ్ చేయనున్నారు. ఆ సందర్భంగా పలువురు ప్రముఖులు విచ్చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సందడి చేశారు. ఆయన సినిమాలో శివుడి రోల్ లో కనిపించనున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన లుక్ ఇప్పటికే క్రేజీ రెస్పాన్స్ అందుకుంది.

అయితే ముంబైలో జరిగిన ఈవెంట్ లో అక్షయ్ కుమార్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్లెయిన్ కలర్ స్టైలిష్ డ్రెస్ వేసుకుని అటెండ్ అయ్యారు. ఈవెంట్ లోపలకు వెళ్లేముందు ఫోటోలకు పోజులు ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో, పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఓ చేతిలో ఢమరుకం పట్టుకొని.. మరో చేతితో త్రిశూలాన్ని పట్టుకున్న అక్షయ్ లుక్ కు ఫిదా అయ్యామని.. ఇప్పుడు మూవీ కోసం వెయిటింగ్ అని నెటిజన్లు అంటున్నారు.