Begin typing your search above and press return to search.

కన్నప్పపై ఊహించని గాసిప్స్.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్!

గత వారం రోజుల్లో 15 నిమిషాల పాటు ఓ ముఖ్యమైన VFX ఎపిసోడ్‌ను మాత్రమే క్వాలిటీ చెక్ కోసం టీం రివ్యూచేసింది.

By:  Tupaki Desk   |   1 April 2025 1:23 PM
కన్నప్పపై ఊహించని గాసిప్స్.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్!
X

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప' పై ఇటీవల కొన్ని అపోహలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే టీజర్, సాంగ్స్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు విడుదల వాయిదా పడ్డ నేపథ్యంలో కొత్త వదంతులు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా సినిమాను కొన్ని స్పెషల్ పర్సన్స్ కి ప్రీమియర్ చేశారనే వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో కన్నప్ప టీం అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. ''సినిమా మొత్తం ఎవరికీ చూపించడం జరగలేదు. గత వారం రోజుల్లో 15 నిమిషాల పాటు ఓ ముఖ్యమైన VFX ఎపిసోడ్‌ను మాత్రమే క్వాలిటీ చెక్ కోసం టీం రివ్యూచేసింది. దీన్ని కొన్ని మీడియాలో సినిమా మొత్తం ప్రీమియర్ అయినట్లు ప్రచారం చేయడం దురదృష్టకరం,'' అంటూ స్పష్టంగా పేర్కొంది.

ఇప్పటికీ సినిమా ఫస్ట్ కట్ పూర్తికాలేదని, అత్యంత కష్టతరమైన గ్రాఫిక్స్ పనితీరుతో కూడిన సినిమాగా ఇది రూపొందుతోందని తెలిపింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ అత్యున్నత ప్రమాణాలను పాటించాలన్న లక్ష్యంతో వర్క్ జరుగుతోందని, అందుకే మరింత సమయం పడుతోందని టీం తెలిపింది. ఇకపోతే కొన్ని టెక్నికల్ అంశాలపై కూడా వర్క్ జరుగుతున్నట్లు తెలిపారు.

ఈ క్లారిటీతో కన్నప్పపై అభిమానుల్లో నెలకొన్న అసంతృప్తికి కొంత ముగింపు లభించినట్టే. సినిమా ఎంత ఆలస్యం అయినా ఫినిషింగ్ పనుల్లో రాజీ పడదన్న విషయంలో టీం చేసిన వర్క్ కి మంచి స్పందన వస్తోంది. సినిమాకు సంబంధించిన అన్ని అధికారిక అప్డేట్స్ త్వరలోనే మేకర్స్ ద్వారా రానున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం కన్నప్ప టీం విడుదల తేదీకి సంబంధించి కొత్త ప్లాన్ సిద్ధం చేస్తోందట.

ప్రత్యేకించి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తైన తరువాతే విడుదల తేదీ ప్రకటించాలన్నది టీం ఉద్దేశం. ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్న విష్ణు ఎడిటింగ్ వర్క్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో, శివుడి పాత్రలో కనిపించనున్న ప్రభాస్, అలాగే అక్షయ్ కుమార్ పాత్రలు ప్రేక్షకుల్లో భారీ ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఈ సినిమా ఇండియన్ మైథలజీలో ఓ కొత్త కోణాన్ని అందించబోతుందనే అంచనాలున్నాయి. మరి సినిమా విడుదలపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.