Begin typing your search above and press return to search.

ప్రభాస్.. ప్రళయ కాల రుద్రుడు

ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "ప్రళయ కాల రుద్రుడు! త్రికాల మార్గదర్శకుడు !! శివాజ్ఞ పరిపాలకుడు !!!" అనే క్యాప్షన్ పోస్టర్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

By:  Tupaki Desk   |   3 Feb 2025 6:12 AM GMT
ప్రభాస్.. ప్రళయ కాల రుద్రుడు
X

కన్నప్ప సినిమా గురించి గత కొద్ది రోజులుగా మంచి హైప్ క్రియేట్ అవుతోంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్, అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్, మలయాళం, తమిళ ఇండస్ట్రీలకు చెందిన అగ్ర నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రాచీన భారతీయ కన్నప్ప కథాంశం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా సినీ ప్రేమికుల్లో భారీ ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఇతర పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా భారీ తారాగణంతో రూపొందుతోంది. మంచు విష్ణు టైటిల్ రోల్ లో కనిపించనుండగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మధు, అర్పిత రాంకా, సంపత్ రాజ్, దేవరాజ్, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ముకేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ మరియు టెక్నికల్ స్టాండర్డ్స్ ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అప్డేట్ వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో రుద్ర అవతారంలో కనిపించనున్నాడు. ఈరోజు విడుదలైన కొత్త పోస్టర్‌లో ప్రభాస్ అత్యంత పవర్‌ఫుల్ లుక్‌లో దర్శనమిచ్చాడు.

త్రిశూలం చేతబట్టి, గంభీరమైన శివతాండవం భంగిమలో కనిపిస్తున్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "ప్రళయ కాల రుద్రుడు! త్రికాల మార్గదర్శకుడు !! శివాజ్ఞ పరిపాలకుడు !!!" అనే క్యాప్షన్ పోస్టర్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభాస్ ఈ సినిమాలో నందీశ్వరుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన లుక్ చూసిన వెంటనే ఆడియెన్స్‌లో భారీ హైప్ క్రియేట్ అయింది.

గతంలో టాలీవుడ్‌లో ఇలాంటి పవర్‌ఫుల్ పాత్రలు చాలా తక్కువగా తెరకెక్కాయి. అయితే కన్నప్ప సినిమాలో ప్రభాస్ లుక్ చూసిన తర్వాత ఈ సినిమా మంచి హైప్ కలిగి ఉండేలా ఉంది. టీజర్, ఇతర అప్‌డేట్స్ తోనే సినిమాపై అంచనాలు పెరిగిన నేపథ్యంలో, ఈ రుద్ర లుక్ పోస్టర్ మరోసారి సినిమాకు పబ్లిసిటీని పెంచింది. కన్నప్ప సినిమా ఏప్రిల్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రాచీన భారతీయ సంస్కృతిని, భక్తి, యుద్ధ శౌర్యాన్ని కలిపి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్‌ను ప్రతీ సోమవారం విడుదల చేస్తూ వస్తున్నారు. కన్నప్ప కథలో ఉన్న మైథలాజికల్ ఎలిమెంట్స్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల పాత్రలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉన్నాయి. ప్రస్తుతం బెంగుళూరు, చెన్నైలో షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకోగా, త్వరలో సినిమా మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి. ఈ ప్రాజెక్ట్ తెలుగు ఇండస్ట్రీలో అత్యంత హైప్ క్రియేట్ చేస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది.