Begin typing your search above and press return to search.

కన్నప్ప కూడా అదే బాటలో వెళ్తుందా..?

కన్నప్ప సినిమా చేయాలనే ఆలోచనే మొదలు తన మార్కెట్ ని మించి బడ్జెట్.. భారీ స్టార్ కాస్ట్ ఇలా సినిమాకు ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తున్నాడు మంచు హీరో.

By:  Tupaki Desk   |   24 Feb 2024 2:30 PM GMT
కన్నప్ప కూడా అదే బాటలో వెళ్తుందా..?
X

రిస్క్ చేస్తేనే కానీ ఇక్కడ సర్వైవ్ అవ్వలేమని తెలుసుకున్న స్టార్స్ సినిమా సినిమాకు భారీ రిస్క్ చేసి మరీ అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ లెగసీ ఉన్న ఫ్యామిలీ హీరోలైతే ఇంకాస్త ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మంచు ఫ్యామిలీ హీరో మంచు విష్ణు కూడా కెరీర్ లో భారీ రిస్క్ చేస్తున్నాడు. కన్నప్ప సినిమా చేయాలనే ఆలోచనే మొదలు తన మార్కెట్ ని మించి బడ్జెట్.. భారీ స్టార్ కాస్ట్ ఇలా సినిమాకు ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తున్నాడు మంచు హీరో.

ప్రభాస్ లాంటి హీరోని సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ గా ఒప్పించి కన్నప్ప సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాడు మంచు విష్ణు. కన్నప్ప సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. మంచు విష్ణు 100 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొన్నటిదాకా ఒక సినిమాగా తీసుకురావాలనే ఆలోచన ఉన్నా ఇప్పుడు సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

బాహుబలి నుంచి ఒక కథను రెండు భాగాలుగా రెండు సినిమాలతో చెప్పొచ్చు అనే ధైర్యం ఇచ్చాడు దర్శక ధీరుడు రాజమౌళి. అదే పంథాలో కన్నడలో కె.జి.ఎఫ్ వచ్చింది. పుష్ప కూడా రెండు భాగాలుగా ఫిక్స్ చేశారు. ఇప్పుడు అదే పంథాలో కన్నప్పని కూడా రెండు భాగాలుగా చెప్పబోతున్నారని టాక్. సినిమాపై బజ్ పెంచే ప్రయత్నంలో ఒక గ్లింప్స్ రెడీ చేశారట కన్నప్ప టీం. ఈ టీజర్ తోనే సినిమా గురించి ఆడియన్స్ అంతా మాట్లాడుకునేలా చేస్తారని తెలుస్తుంది.

ఇక సినిమా కూడా జరిగినంత వరకు బాగా వస్తుండటం వల్ల సినిమాను ఇంకా పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే కన్నప్పని కూడా టూ పార్ట్స్ గా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కూడా ఇలా రెండు భాగాలుగా సర్ ప్రైజ్ చేస్తున్నాయి. వాటి తరహాలోనే కన్నప్ప కూడా అలానే రాబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై కన్నప్ప హీరో నిర్మాత మంచు విష్ణు స్పందించాల్సి ఉంది. హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈమధ్య ఆధ్యాత్మిక కథలకు వెండితెర మీద మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రేక్షకులు కూడా అలాంటి కథలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కన్నప్ప కూడా ఒక శివ భక్తుని కథ తప్పకుండా ఈ సినిమా కూడా నేషనల్ వైడ్ గా ప్రేక్షకులను అలరిస్తే సినిమా రికార్డులు సృష్టిస్తుందని చెప్పొచ్చు.