Begin typing your search above and press return to search.

ఆ ఫామిలీ హీరో కోసం స్టార్ల మీద స్టార్లు లైన్ లోకి!

ఇప్పుడు మరికొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని ఓ కీలక పాత్ర కోసం మంచు విష్ణు ఎంపిక చేయాలని అనుకుంటున్నారంట.

By:  Tupaki Desk   |   10 Oct 2023 4:00 AM GMT
ఆ ఫామిలీ హీరో కోసం స్టార్ల మీద స్టార్లు లైన్ లోకి!
X

మంచు విష్ణు లీడ్ రోల్ లో మోహన్ బాబు నిర్మించనున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ భక్త కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఎన్నో సూపర్ హిట్ పౌరాణిక సీరియల్స్ కి దర్శకత్వం వహించిన అతను భక్త కన్నప్ప కోసం పని చేయబోతున్నారు. భారీ తారాగణం ఈ చిత్రంలో ఉండేలా మంచు విష్ణు ప్లాన్ చేసుకుంటున్నారు.

చిత్రాన్ని గ్రాండియర్ గా పాన్ ఇండియా అప్పీల్ తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా క్యాస్టింగ్ పైన మంచు విష్ణు ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ చిత్రంలో శివ పార్వతులుగా ప్రభాస్, నయనతారని కన్ఫర్మ్ చేశారు. వారు కాల్షీట్స్ కూడా ఇచ్చారంట. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ధ్రువీకరించారు.

ఇప్పుడు మరికొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని ఓ కీలక పాత్ర కోసం మంచు విష్ణు ఎంపిక చేయాలని అనుకుంటున్నారంట. దానికోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే దగ్గుబాటి రానాని కూడా ఓ ఇంటరెస్టింగ్ రోల్ లో చూపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్ క్యాస్టింగ్ ని భక్త కన్నప్ప మూవీలో పాత్రల కోసం ఎంపిక చేసే పనిలో మంచు విష్ణు ఉన్నారు.

ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎప్పటి నుంచో చెబుతోన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లుగానే మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ని ఇండియా మొత్తం చూసేలా చేయడానికి స్టార్ క్యాస్టింగ్ మొత్తాన్ని రంగంలోకి దించుతున్నాడు. మరి క్యాస్టింగ్ ని మూవీలో ఎలాంటి పాత్రల కోసం ఉపయోగించుకుంటారు అనేది చూడాలి. ఏది ఏమైనా సినిమాకి మాత్రం ఈ స్టార్ క్యాస్టింగ్ కారణంగా కావాల్సినంత హైప్ దొరుకుతోంది.

మంచు ఫ్యామిలీ నుంచి రాబోతున్న అతి పెద్ద ప్రాజెక్ట్ ఇదే కావడంతో మోహన్ బాబు కూడా తన పరిచయాలని గట్టిగానే ఉపయోగిస్తున్నారు. సినిమాని గ్రాండ్ గా మార్కెట్ చేయడానికి ఉన్న అన్ని అవకాశాలని క్రియేట్ చేస్తున్నారు.