Begin typing your search above and press return to search.

కన్నప్ప టైటిల్ పోస్టర్.. మంచు విష్ణు స్టన్నింగ్!

మంచు విష్ణు లీడ్ రోల్ లో మోహన్ బాబు నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చాలా కాలం నుంచి మంచు విష్ణు చెబుతున్నారు

By:  Tupaki Desk   |   23 Nov 2023 3:57 AM GMT
కన్నప్ప టైటిల్ పోస్టర్.. మంచు విష్ణు స్టన్నింగ్!
X

మంచు విష్ణు లీడ్ రోల్ లో మోహన్ బాబు నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చాలా కాలం నుంచి మంచు విష్ణు చెబుతున్నారు. దీనికోసం తన మార్కెట్ కి మించి భారీ బడ్జెట్ ని ఖర్చు పెడుతున్నారు. విజువల్ వండర్ గా ఉండేందుకు ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. బాలీవుడ్ లో ఎన్నో పౌరాణిక సీరియస్ సినిమాలు చేసిన ముఖేష్ కుమార్ సింగ్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.


శ్రీకాళహస్తి నేపథ్యంలో భక్త కన్నప్పగా అందరికి సుపరిచితం అయిన కన్నప్ప జీవిత కథకి ఇది తెరరూపం. ఇప్పటికే కృష్ణంరాజు హీరోగా ఈ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. అయితే మరింత అడ్వాన్స్ మోడ్ లో గ్రాఫిక్స్ మాయాజాలంతో కన్నప్ప సినిమాని మంచు విష్ణు లీడ్ రోల్ లో చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిపొయింది.

అయితే నార్త్ లో మాత్రం ఇవి సర్వసాధారణంగా ఉంటాయి. ఎతిస్ట్ వారియర్ గా ఉన్నవాడు పరమ శివభక్తుడిలా ఎలా పరిణామం చెందాడు. అతను శివభక్తితో శివయ్యని ఎలా మెప్పించాడు అనేది కన్నప్ప మూవీలో చూపించబోతున్నారు. దీనిని బట్టి ఈ సినిమాలో కేవలం డివోషనల్ టచ్ మాత్రమే కాకుండా కన్నప్ప శివభక్తుడిగా మారడానికి ముందు అతని లైఫ్ ఎలా ఉండేది కూడా పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

తాజాగా మంచు మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా కన్నప్ప టైటిల్, కాన్సెప్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. సౌత్ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా కన్నప్ప టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేయడం విశేషం. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో మోహన్ బాబు, డార్లింగ్ ప్రభాస్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. పోస్టర్ అయితే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. విష్ణు మంచు తనని తాను గ్రాండ్ గా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారని పోస్టర్ బట్టి అర్ధమవుతోంది.