Begin typing your search above and press return to search.

భక్త కన్నప్ప.. ఆ ప్రశ్న నన్ను డిస్టర్బ్ చేసింది

మంచు విష్ణు హీరోగా ఫ్యాన్ ఇండియా రేంజ్ లో తెరపైకి రాబోతున్న సినిమా భక్తకన్నప్ప

By:  Tupaki Desk   |   19 Jan 2024 7:54 AM GMT
భక్త కన్నప్ప.. ఆ ప్రశ్న నన్ను డిస్టర్బ్ చేసింది
X

మంచు విష్ణు హీరోగా ఫ్యాన్ ఇండియా రేంజ్ లో తెరపైకి రాబోతున్న సినిమా భక్తకన్నప్ప. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. రీసెంట్ గా న్యూజిలాండ్లో కూడా ఒక కీలకమైన షెడ్యూల్ను పూర్తి చేసుకున్నారు. శివ భక్తుడు భక్త కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నెవర్ బిఫోర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ లో కూడా పాల్గొన్నట్లు గతంలోనే విష్ణు తెలియజేశారు.


అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ద్వారా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. సినిమాలో ప్రభాస్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు వచ్చిన అప్డేట్ ద్వారా కూడా ఈ సినిమాపై అమాంతంగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను మంచు విష్ణు మరోసారి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు విష్ణు సమాధానం తెలియజేశారు.

చాలామంది సినిమా గురించి రకరకాల ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా నా ఫిట్నెస్ గురించి కూడా అడిగారు. కన్నడ తమిళ్ అలాగే మిగతా వాళ్ళు ఎక్కువగా ఒక ప్రశ్న అడిగిన విధానం బాగా డిస్టర్బ్ చేసింది అని విష్ణు అన్నారు. విష్ణు మాట్లాడుతూ.. మీ మైథాలాజికల్ మూవీ భక్తకన్నప్ప ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అని అడిగారు. అయితే మైథాలజికల్ అంటే దానికి చారిత్రాత్మక ఆధారాలు ఏమీ ఉండవు. అదొక కల్పితం అని చెప్పవచ్చు.

నాసా నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రామసేతు ఉందని మనందరికీ అర్థమైంది. రామాయణం నిజమని కూడా ఒక ప్రూఫ్ ఉందని చెప్పాక అందరు కరెక్టు అని అన్నారు. మహాభారతంలో ద్వారక ఇప్పుడు ఎక్కడుందో తెలుసుకున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన మహాభారతంలో ద్వారక గోడలు ఎలా ఉన్నాయి అనే విషయం గురించి చెప్పారు. అది మనకి ఆధారాలతో దొరికింది. మన సంస్కృతిని మనం ఎందుకు మనం నమ్మడం లేదు? మన చరిత్రను మనం ఎందుకు గ్రహించడం లేదు?

మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళని బలంగా నమ్ముకుంటారు. గర్వంగా ఫీల్ అవుతారు. ఇక భక్త కన్నప్ప నిజమైన కథ. శ్రీకాళహస్తీశ్వర గుడి అందుకు ఆధారం. పార్వతి పరమేశ్వరులను తల్లిదండ్రులు అని నేను నమ్ముతాను. ఆ గుడి వందల వేల సంవత్సరాల నుంచి ఉంది. ఆ లింగం మైథలజికల్ కాదు అదొక నిజమైన చరిత్ర. కన్నప్ప నిజమైన కథ. త్వరలోనే భక్తకన్నప్ప ప్రపంచంలోకి తప్పకుండా మిమ్మల్ని తీసుకువెళ్తాను అని మంచు విష్ణు తెలుపుతూ మన చరిత్రను గ్రహించాలి అని గర్వపడాలి అని వివరణ ఇచ్చాడు.