Begin typing your search above and press return to search.

కన్నప్ప.. అంతకుమించి అనేలా..

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మూవీ టీజర్ ఈ రోజు 6 గంటలకి రిలీజ్ కానుంది. ఇక కన్నప్ప కోసం మంచు విష్ణు కూడా స్పెషల్ గా మేకోవర్ అయ్యి కనిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 May 2024 11:20 AM GMT
కన్నప్ప.. అంతకుమించి అనేలా..
X

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. హిందీలో మహాభారతం లాంటి ఇతిహాస సీరియల్ ని అద్భుతంగా తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప మూవీ సిద్ధం అవుతోంది.

ఈ సినిమాలో నందీశ్వరుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నారు. అతని పాత్ర మూవీలో చాలా కీలకంగా ఉండబోతుందంట. అలాగే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు కన్నప్ప సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ముఖ్యంగా ప్రభాస్ కూడా స్పెషల్ పాత్రలో నటిస్తూ ఉండటంతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. కన్నప్ప సినిమాని వీలైనంత స్థాయిలో దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకి చేరువ చేయడానికి మంచు విష్ణు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమా టీజర్ ని ఏకంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చిత్ర యూనిట్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఏర్పాటు చేసిన పెవీలియన్ కి చేరుకుంది.

వీరిలో మంచు విష్ణు, దర్శకుడు ముఖేష్ కుమార్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పాటుగా మరికొంత మంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారంట. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మూవీ టీజర్ ఈ రోజు 6 గంటలకి రిలీజ్ కానుంది. ఇక కన్నప్ప కోసం మంచు విష్ణు కూడా స్పెషల్ గా మేకోవర్ అయ్యి కనిపిస్తున్నారు. ఇందులో అతని నటన ఛాయా హైలెట్ అవుతుందని చెబుతున్నారు.

పోస్టర్ తోనే కన్నప్ప సినిమాపై అంచనాలు పెంచేశారు. కచ్చితంగా ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా తన పేరు వినిపించేలా చేసుకోవాలనే కసితో విష్ణు ఉన్నారు. శ్రీకాళహస్తిలో జన ప్రాచూర్యంలో ఉన్న పౌరాణిక, ఆధ్యాత్మిక కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. మహా శివభక్తుడైన భక్త కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తున్నారు.

క్రూరమైన ట్రైబల్ వారియర్ మహా శివభక్తుడుగా ఎలా మారాడు అనేది ఈ కన్నప్ప కథలో అంతర్లీనంగా చెప్పబోతున్నారు. మరి ఈ మూవీ అతనికి ఎలాంటి ఇమేజ్ తీసుకొస్తుందనేది ఇప్పుడుఆసక్తికరంగా మారింది. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. ఇక ప్రమోషన్స్ డోస్ పెంచేలా మేకర్స్ అంతకుమించి అనేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మరి సినిమా టీజర్ ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి.