Begin typing your search above and press return to search.

ఆ మెయిల్స్ తో మంచు టీమ్ కు సంబంధం లేదు: మంచు విష్ణు

ఫేక్ మెయిల్స్ విషయంపై 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, కన్నప్ప మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ సైబర్‌ క్రైమ్‌ కు ఫిర్యాదు చేయనున్నారని తెలిపింది.

By:  Tupaki Desk   |   27 July 2024 7:14 AM
ఆ మెయిల్స్ తో మంచు టీమ్ కు సంబంధం లేదు: మంచు విష్ణు
X

టాలీవుడ్ హీరో మంచు విష్ణు.. ప్రస్తుతం కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ.. డిసెంబర్ లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. భారీ బడ్జెట్ తో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై చిత్రం రూపొందుతోంది. అయితే అదే బ్యానర్ పేరుతో కొందరికి ఇటీవల మెయిల్స్ వచ్చాయి. వాటి స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు.

దీంతో మంచు విష్ణు టీమ్ స్పందించింది. ఆ ఈ-మెయిల్స్ తాము పంపలేదని క్లారిటీ ఇచ్చింది. అవి ఫేక్ అని తెలిపింది. తమ నిర్మాణ సంస్థకు ఎలాంటి సంబంధం లేని ఫేక్ మెయిల్ TwentyFour FFOfficial పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ తెలిపింది. తమ సంస్థ అఫిషియల్ మెయిల్ ఐడీ info@24FramesFactory.com నుంచి కాకుండా.. ఎక్కడ నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా నమ్మొద్దని కోరింది. ఫేక్ మెయిల్ ఐడీతో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది

ఫేక్ మెయిల్స్ విషయంపై 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, కన్నప్ప మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ సైబర్‌ క్రైమ్‌ కు ఫిర్యాదు చేయనున్నారని తెలిపింది. నటీనటుల గౌరవం కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా మంచు విష్ణు పోరాటం చేస్తున్నారని పేర్కొంది. ఆయన గౌరవానికి భంగం కలిగించేలా కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. అలాంటి వాటిని గట్టిగా ఎదుర్కొంటామని చెప్పింది.

అయితే ఇటీవల సోషల్ మీడియాలో నటీనటులపై అసభ్యకరమైన పోస్టులు, కామెంట్స్ పెట్టిన వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు మంచు విష్ణు. ఇష్టం వచ్చినట్టు కామెంట్స్, ట్రోల్స్ చేసిన వారిపై మండిపడ్డారు. ఒక్క రోజులో తీసేయాలని డెడ్ లైన్ పెట్టారు. ఆ తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై వేటు పడేలా చర్యలు తీసుకున్నారు. మరికొన్ని వాటిపై కూడా స్ట్రైక్ పడేలా చర్యల తీసుకునేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిపారు మంచు విష్ణు. ఆ తర్వాతే ఈ ఫేక్ మెయిల్స్ ఇష్యూ జరగడం గమనార్హం.

మహాభారతం హిందీ సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న కన్నప్పలో మంచు విష్ణు లీడ్ రోల్ లో పోషిస్తున్నారు. అయితే కన్నప్ప సినిమా గురించి పాజిటివ్ వీడియోలు క్రియేట్ చేసి పంపాలని, అలా చేస్తే యూట్యూబ్ ఛానెల్‍ పై బ్యాన్‍ తొలగేలా చేస్తామని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పేరుతో కొందరికి ఫేక్ మెయిల్స్ వచ్చాయి. ఆ స్క్రీన్‍ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. కొందరు మంచు విష్ణుపై విమర్శలు చేశారు. దీంతో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ క్లారిటీ ఇచ్చింది.