Begin typing your search above and press return to search.

మంచు విష్ణు కన్నప్ప.. అసలు అప్డేట్ కు ప్లాన్ సెట్టయ్యింది

'మేము కన్నప్ప టీజర్‌ని ఇక్కడ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించాము మరియు ఇది అద్భుతమైన సానుకూల స్పందనను పొందింది.

By:  Tupaki Desk   |   21 May 2024 9:53 AM GMT
మంచు విష్ణు కన్నప్ప.. అసలు అప్డేట్ కు ప్లాన్ సెట్టయ్యింది
X

మంచు విష్ణు కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా కన్నప్ప. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు ఏదో మీడియం బడ్జెట్ సినిమా అని అందరూ అనుకున్నారు. కానీ మంచు విష్ణు మాత్రం దాన్ని ప్రమోట్ చేసిన విధానం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా సినిమాలో భారీ తారాగణం ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా ప్రతి భాషలో కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేవిధంగా మేకర్స్ ప్లాన్ చేసిన విధానం అద్భుతం అని చెప్పాలి ముఖ్యంగా.

పాత్రలను సెలెక్ట్ చేసుకున్న తీరును కూడా మెచ్చుకొని తీరాల్సిందే. ఈ సినిమాలో మలయాళం స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే తమిళంలోని మరి కొంతమంది స్టార్ నాటినటులు కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారు. ఇక మోహన్ బాబు కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ సినిమాను 100 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఇక కన్నప్ప సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒక పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. నందీశ్వరుడు క్యారెక్టర్ లో ఆయన కనిపించబోతున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ ను ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్ లో హైలైట్ అయ్యే విధంగా విడుదల చేశారు.

కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో భక్తకన్నప్ప టీజర్ను విడుదల చేసినట్లు మంచి విష్ణు ఆఫీషియల్ గా తెలియజేశారు. అలాగే త్వరలోనే మన ఆడియన్స్ కోసం కూడా టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు వివరణ ఇచ్చారు. ముందుగా టీజర్ ను ఒక థియేటర్లో ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నట్లు తెలిపిన విష్ణు కొంతమంది ఆడియన్స్ కు కూడా సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు వివరణ ఇచ్చారు.

తప్పకుండా టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అని సోషల్ మీడియాలో ఈ విధంగా తెలియజేశారు. 'మేము కన్నప్ప టీజర్‌ని ఇక్కడ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించాము మరియు ఇది అద్భుతమైన సానుకూల స్పందనను పొందింది. అంతర్జాతీయ పంపిణీదారులు, స్థానిక భారతీయులు, దీనిని చూసిన ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టపడ్డారు. ఇలాంటి అద్భుతమైన స్పందనను చూసిన తర్వాత నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.

మన భారతదేశ ప్రేక్షకుల కోసం, ఈ టీజర్‌ను జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాము. మే 30న, నేను హైదరాబాద్‌లోని ప్రముఖ థియేటర్‌లో తెలుగు వెర్షన్ టీజర్‌ను ప్రదర్శించబోతున్నాను. నా ప్రయాణంలో కన్నప్పను ప్రోత్సహించిన మరియు ఇన్‌స్టాగ్రామ్ మరియు ట్విట్టర్‌లో సహాయ సందేశాలను పంపిన ప్రత్యేక ఆహ్వానితుల కోసం ఈ ప్రత్యేక ప్రదర్శన. నా బృందం ఈ ప్రత్యేక ఆహ్వానితులకు చేరుకుంటుంది. మీ అందరితో కన్నప్ప ప్రపంచాన్ని షేర్ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను..' అని మంచు విష్ణు తెలిపారు.