Begin typing your search above and press return to search.

కన్నప్ప టీజర్: స్టార్స్ తో సర్‌ప్రైజ్ థ్రిల్!

మంచు విష్ణు నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 'కన్నప్ప' మార్కెట్ లో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది.

By:  Tupaki Desk   |   14 Jun 2024 12:10 PM GMT
కన్నప్ప టీజర్: స్టార్స్ తో సర్‌ప్రైజ్ థ్రిల్!
X

మంచు విష్ణు నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 'కన్నప్ప' మార్కెట్ లో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. భారీ అంచనాల మధ్య శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. న్యూజిలాండ్ అడవులు మరియు రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా సెట్స్ ఏర్పాటు చేసి చిత్రీకరణ కొనసాగిస్తున్నారు. ఈ చిత్రాన్ని మోహన్ బాబు దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ కూడ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది.


ఇక ఇప్పటికే 'కన్నప్ప' సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ గ్రాండ్ గా స్టార్ట్ అయ్యాయి. ఇటీవల కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో 'కన్నప్ప' టీజర్ ప్రదర్శించారు. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చినట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ టీజర్ యూట్యూబ్‌లో విడుదల చేయడానికి కాస్త టైమ్ తీసుకున్నారు. కొన్ని థియేటర్స్ లో కొంతమందికి మాత్రమే ఈ టీజర్ స్పెషల్‌గా ప్రదర్శించారు.

టీజర్ లాంచ్ ఈవెంట్లో ఈ టీజర్‌ని ప్లే చేయడంతో, ఇందులోని కొన్ని షాట్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా అవి వైరల్ అవుతున్నాయి. 'కన్నప్ప' సినిమాలో శివుడు పాత్ర ప్రధానంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో, శివుడి పాత్రలో మొదట ప్రభాస్ నటిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ, తాజా టీజర్ ప్రకారం అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్నారు.

అలాగే, టీజర్‌లో ప్రభాస్ కళ్లను చూపిస్తూ ఒక సన్నివేశం ఉంది. సినిమాకు ఆ సీన్స్ మేజర్ హైలెట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక టీజర్‌లో కన్నప్పని ఓ వీరుడిగా చూపిస్తూ యుద్ధ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ టీజర్‌ని యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ అందుకునే అవకాశం ఉంది.

అయితే ఇంతకుముందు వచ్చిన కన్నప్ప సినిమాల కంటే ఇది కాస్త భిన్నంగా ఉంది. కాస్ట్యూమ్, విజువల్స్ అంతా కూడా హాలీవుడ్ తరహాలో ఉండేలా మేకర్స్ ఒక ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమా విడుదలకు ముందే, టీజర్ ద్వారా భారీ అంచనాలు సృష్టించడంలో 'కన్నప్ప' టీమ్ విజయవంతం అవుతుందనే ఆశించవచ్చు. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో మైలురాయిగా నిలిచే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ పై కూడా మేకర్స్ త్వరలోనే ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక ఈ సినిమాలో మధుబాల, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, బ్రహ్మానందం లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.