Begin typing your search above and press return to search.

మంచు విష్ణు కన్నప్ప.. రిలీజ్ ఎప్పుడంటే?

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తన డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకోవడానికి కన్నప్ప రోల్ లో ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

By:  Tupaki Desk   |   18 July 2024 11:00 AM GMT
మంచు విష్ణు కన్నప్ప.. రిలీజ్ ఎప్పుడంటే?
X

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. 100+ కోట్ల భారీ బడ్జెట్ తో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా రెడీ అవుతోంది. మంచు విష్ణు మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా కన్నప్ప చిత్రాన్ని చేస్తున్నాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తన డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకోవడానికి కన్నప్ప రోల్ లో ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

రీసెంట్ గా వచ్చిన ఈ మూవీ టీజర్ కి మంచి స్పందన వచ్చింది. కన్నప్ప మూవీలో మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. వీరందరూ కూడా మోహన్ బాబు, మంచు విష్ణుతో ఉన్న రిలేషన్ కొద్ది కన్నప్ప సినిమాలో గెస్ట్ రోల్స్ లో కనిపించడానికి ముందుకొచ్చారంట.

అక్షయ్ కుమార్ కన్నప్ప సినిమాలో శివుడి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ప్రభాస్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందంట. ఇక్క మంచు విష్ణు ఈ చిత్రంలో మహా శివభక్తుడైన ట్రైబల్ వారియర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. మూవీలో పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని అర్ధమవుతోంది. కచ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటాననే కాన్ఫిడెన్స్ తో మంచు విష్ణు ఉన్నారు.

మోహన్ బాబు పాత్ర ఈ చిత్రంలో చాలా ప్రత్యేకంగా ఉంటుందంట. ఇదిలా ఉంటే ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు కానీ డిసెంబర్ లో థియేటర్స్ లోకి రావడం పక్కా అని క్లారిటీ ఇచ్చారు. ఆ నెలలో ఇప్పటికే ఐదు సినిమాల వరకు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ డిసెంబర్ 6న రిలీజ్ కాబోతోంది. తరువాత నితిన్ రాబిన్ హుడ్, నాగ చైతన్య పాన్ ఇండియా మూవీ తండేల్ కూడా డిసెంబర్ లోనే రిలీజ్ కాబోతోంది. ఇవి కాకుండా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డిసెంబర్ అనుకుంటున్నారు. ఇప్పుడు లైన్ అప్ లోకి కన్నప్ప కూడా చేరింది. దీంతో మోస్ట్ హ్యాపెనింగ్ సినిమాలు అన్ని కూడా ఈ ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ కాబోతున్నాయని అర్ధమవుతోంది.