Begin typing your search above and press return to search.

'కాంతార' కొత్తగా మళ్లీ ప్రారంభం...!

రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'కాంతార' సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే

By:  Tupaki Desk   |   6 Nov 2024 7:01 AM GMT
కాంతార కొత్తగా మళ్లీ ప్రారంభం...!
X

రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'కాంతార' సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది. నాన్‌ థియేట్రికల్ రైట్స్ ద్వారా వందల కోట్లని నిర్మాతలకు తెచ్చి పెట్టింది. అందుకే కాంతార సినిమా నుంచి మరో పార్ట్‌ ను తీసుకు రావాలని భావించారు. కాంతార సీక్వెల్‌ కథకు స్కోప్‌ లేక పోవడంతో కాంతార ప్రీ క్వెల్‌ ను ప్లాన్‌ చేయడం జరిగింది. కాంతార చాప్టర్‌ 1 అంటూ ప్రీక్వెల్‌ ను రిషబ్‌ శెట్టి ఇప్పటికే ప్రారంభించడం జరిగింది.

కన్నడ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ కాంతార 1 షూటింగ్‌ పూర్తి అయింది. తాజాగా మూడో షెడ్యూల్‌ ప్రారంభం అయింది. మూడో షెడ్యూల్‌ ను ఏకంగా 60 రోజుల పాటు వివిధ లొకేషన్స్‌ లో చేయబోతున్నారు. ఈ షెడ్యూల్‌ లో కీలకమైన సన్నివేశాలతో పాటు రెండు పాటల చిత్రీకరణ యాక్షన్‌ సన్నివేశాలు సైతం ఉంటాయని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌తో సినిమా మేజర్‌ పార్ట్‌ పూర్తి అవుతుంది. సగానికి పైగా షూటింగ్‌ పూర్తి కానున్న నేపథ్యంలో టీజర్ లేదా కీలక అప్డేట్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

2025 జనవరిలో కాంతార మూడో షెడ్యూల్‌ ను ముగించి అదే సమయంలో రిలీజ్ డేట్‌ ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని, అదే సమయంలో టీజర్ ను వదిలే అవకాశాలు ఉన్నాయంటూ కన్నడ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కాంతార సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్‌ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాంతార మొదటి పార్ట్‌ రూ.400 కోట్ల వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఈ ప్రీక్వెల్‌ వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం ఖాయం అనే నమ్మకంను మేకర్స్ తో పాటు కన్నడ మీడియా సర్కిల్స్ వారు, ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.

రిషబ్‌ శెట్టికి కాంతార సినిమాతో టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ దక్కింది. అందుకే ఆయన్ను హనుమాన్‌ సినిమాకు సీక్వెల్‌గా రూపొందబోతున్న జై హనుమాన్‌ సినిమాలో కీలకమైన ఆంజనేయుడి పాత్రకు గాను ఎంపిక చేయడం జరిగింది. సినిమాలో అత్యంత కీలకమైన ఆంజనేయుడి పాత్రను రిషబ్‌ శెట్టి చేసేందుకు ఓకే చెప్పాడు. తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి కాంబోలో ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా జై హనుమాన్‌ ఉండబోతుంది. వచ్చే ఏడాదిలో షూటింగ్‌ ప్రారంభించి 2026లో జై హనుమాన్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని సమాచారం అందుతోంది. ప్రశాంత్‌ వర్మ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.