Begin typing your search above and press return to search.

కాంతారా 2.. ఎన్టీఆర్ గండం?

వచ్చే ఏడాది పాన్ ఇండియా డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులని బాగానే పలకరించబోతున్నాయి.

By:  Tupaki Desk   |   13 Oct 2024 5:36 AM GMT
కాంతారా 2.. ఎన్టీఆర్ గండం?
X

వచ్చే ఏడాది పాన్ ఇండియా డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులని బాగానే పలకరించబోతున్నాయి. ఈ ఏడాదిలో సూర్య ‘కంగువా’ భారీ అంచనాల మధ్యలో రిలీజ్ అవుతోంది. వచ్చే ఏడాది కన్నడ ఇండస్ట్రీ నుంచి రాబోయే ‘కాంతారా 2’ పైన అయితే అంతకుమించి అంచనాలు ఉన్నాయి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతారా’ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 300 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంటే తెలుగులో 60 కోట్ల వరకు వసూళ్లు చేసింది.

ఈ నేపథ్యంలో ‘కాంతారా’ కి ప్రీక్వెల్ గా రాబోతున్న కాంతారా 2పైన ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈ మూవీ 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ‘కాంతారా 2’ చిత్రాన్ని 2025 ఆగస్టులో రిలీజ్ చేసే ప్లానింగ్ లో మేకర్స్ ఉన్నారు. అయితే అదే నెలలో బాలీవుడ్ నుంచి ‘వార్ 2’ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. హిందీ మూవీ కావడంతో తెలుగులో ఈ సినిమాపై హైప్ ఉండదని అనుకోవడానికి లేదు. దీనికి కారణం ‘వార్ 2’ లో హృతిక్ రోషన్ తో పాటు ఎన్ఠీఆర్ ఒక హీరోగా నటిస్తుండటమే. అతని పాత్ర మూవీలో చాలా పవర్ ఫుల్ గా ఉంటుందనే మాట వినిపిస్తోంది. తెలుగులోనే కాదు కన్నడలో కూడా గ్రాండ్ గానే రిలీజయ్యే అవకాశం ఉంది.

డబ్బింగ్ సినిమా అయినా తెలుగులో ఎన్ఠీఆర్ స్ట్రైట్ సినిమాకి ఉన్నంత హైప్ ‘వార్ 2’ పైన ఉంటుంది. అలాగే భారీగా బిజినెస్ జరిగే అవకాశం ఉంది. ఆగష్టు 14న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ‘వార్ 2’, ‘కాంతారా 2’ మధ్య కనీసం రెండు వారాలయిన గ్యాప్ ఉంటే 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టే సత్తా ఒక్కో చిత్రానికి ఉంది. అంతగా ఈ సినిమాలపై హైప్ ఉంది. అయితే ఒకే రోజు పోటీ పడితే మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

ఈ ఇంపాక్ట్ సినిమాల కలెక్షన్స్ పై పడుతుందని భావిస్తున్నారు. అలా కాకుండా రెండు సినిమాల మధ్యలో రిలీజ్ పరంగా గ్యాప్ ఉంటే బెటర్ అనే మాట వినిపిస్తోంది. హీరోల పరంగా రిషబ్ శెట్టితో పోలిస్తే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లకి ఇమేజ్ ఎక్కువ ఉంది. అయితే సినిమాల పరంగా చూసుకుంటే సౌత్ లో ‘వార్ 2’ కంటే ‘కాంతారా 2’ పైన హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

ఈ రెండు సినిమాల బడ్జెట్ కూడా గట్టిగానే ఉంది. అందుకే రిలీజ్ పరంగా కొంత గ్యాప్ చూసుకొని వస్తే ఈ రెండు చిత్రాలని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి మేకర్స్ ఆలోచన ఎలా ఉంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.