Begin typing your search above and press return to search.

ఈ ప్రీక్వెల్ కోసం ఏకంగా 125 కోట్ల బడ్జెట్!

కన్నడంలో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం కాంతారా. ఈ మూవీ గత ఏడాది రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Sep 2023 4:45 AM GMT
ఈ ప్రీక్వెల్ కోసం ఏకంగా 125 కోట్ల బడ్జెట్!
X

కన్నడంలో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం కాంతారా. ఈ మూవీ గత ఏడాది రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. కన్నడంలో కేజీఎఫ్ చాప్టర్ 2 రికార్డులని సైతం కాంతారా బ్రేక్ చేసింది. ఇక డబ్బింగ్ గా ఇతర భాషలలో ప్రేక్షకుల ముందుకి వచ్చి కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించింది. తెలుగులో 29.50 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. గీతా ఆర్ట్స్ కి కాంతారా మూవీ కాసుల వర్షం కురిపించింది.

రిలీజ్ అయిన అన్ని భాషలలో సూపర్ హిట్ అయ్యి ప్రపంచ వ్యాప్తంగా 401 కోట్లు కాంతారా మూవీ లాంగ్ రన్ లో కలెక్ట్ చేయడం విశేషం. ఇప్పుడు కాంతారా 2ని తెరకెక్కించే పనిలో రిషబ్ శెట్టి ఉన్నారు. దీనికోసం ఇన్ని రోజులు స్క్రిప్ వర్క్, ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేశారు. త్వరలో సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నారు. కాంతారా మూవీ కేవలం 15 కోట్ల బడ్జెట్ లోనే తీసేశారు. కథ మొత్తం ఓ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో చెప్పడంతో పాటు బ్యాక్ స్టోరీని ముందు తక్కువగా టచ్ చేయడంతో పెద్ద బడ్జెట్ కాలేదు.

అయితే కాంతారా 2ని సీక్వెల్ తరహాలో కాకుండా ప్రీక్వెల్ గా రిషబ్ శెట్టి సిద్ధం చేస్తున్నారంట. అంటే కాంతారా సినిమాలో చూసిన కథకి ముందుగా ఏం జరిగింది కాంతారా2లో చూపించబోతున్నారంట. దానిని కూడా చాలా గ్రాండియర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించడానికి రిషబ్ శెట్టి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇక కథలో పాత్ర డిమాండ్ మేరకు ప్రాచీన యుద్ధ విద్యలని సైతం రిషబ్ శెట్టి నేర్చుకున్నారు.

ఇక ఈ ప్రీక్వెల్ కోసం ఏకంగా 125 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టబోతున్నారంట. ఇందులో హీరో కమ్ దర్శకుడిగా రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ అధికంగా ఉంటుందని తెలుస్తోంది. సినిమాపైనే కూడా దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో సినిమాలో క్యాస్టింగ్ పరంగా కూడా మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. ఇతర భాషలకి సంబందించిన నటీనటులని కీలక పాత్రల కోసం ఎంపిక చేయనున్నారంట.

సినిమాకి గ్రాండ్ లుక్ తీసుకొచ్చి అన్ని భాషలలో ఒకే సారి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంతారా2లో విఎఫ్ఎక్స్ కి స్కోప్ ఎక్కువ ఉంటుందని సమాచారం. ఈ కారణంగా బడ్జెట్ రేంజ్ కూడా పెరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.