Begin typing your search above and press return to search.

కాంతార పాపకు టాలీవుడ్ ఫస్ట్ ఛాన్స్

ఆ సినిమాలో అంటే డీ గ్లామర్ లుక్ లో పెద్దగా ఎవరి కళ్లకు ఆనలేదు కానీ, నిజానికి సప్తమి రియల్ గా చాలా అందంగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   30 Aug 2023 12:09 PM GMT
కాంతార పాపకు టాలీవుడ్ ఫస్ట్ ఛాన్స్
X

హీరోలు ఒక ఇండస్ట్రీలో కెరీర్ మొదలుపెడితే ఆ ఇండస్ట్రీలోనే ఉంటారు. వారు వేరే ఇండస్ట్రీలో కూడా సినిమా తీయాలి అంటే, వాళ్లకు చాలా కాలం పడుతుంది. కొందరికి అయితే, ఆ అవకాశమే రాదు. కానీ , హీరోయిన్స్ అలా కాదు. ఒక ఇండస్ట్రీలో కాస్త గుర్తింపు వచ్చింది అంటే చాలు, వేరే ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు క్యూలు కడతాయి. వారు ఎక్కడివారైనా పర్వాలేదు, అన్ని ఇండస్ట్రీల్లోనూ సినిమాలు చేయగలరు. అన్ని భాషలను కవర్ చేయగలరు. ఎక్కడికి వెళితే, అక్కడ వారిని ప్రేక్షకులు తమ వారిగా సొంతం చేసుకుంటారు. ఇప్పుడు ఈ ఆఫర్ కాంతారా హీరోయిన్ ని వరించింది.

కంతారా సినిమా ఎంతలా హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆ సినిమా మొదట కేవలం కన్నడలో మాబత్రమే తీయాలి అని అనుకున్నారు. కానీ, తర్వాత అన్ని భాషల్లో పాన్ ఇండియా సినిమా విడుదల చేశారు. విడుదల చేసిన అన్ని భాషల్లోనూ సినిమా కాసుల వర్షం కురిపించింది. దర్శక నిర్మాతలు ఊహించని హిట్ అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది సప్తమి గౌడ.

ఆ సినిమాలో పల్లెటూరి పిల్లగా, డీ గ్లామర్ లుక్ లో కనిపించింది. రెండో భాగంలోనూ ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో సప్తమి నటనకు మంచి మార్కులు పడ్డాయి. చాలా సహజంగా నటించిందని అందరూ మెచ్చుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగులోకి కూడా అడుగుపెడుతోంది. ఆ సినిమాలో అంటే డీ గ్లామర్ లుక్ లో పెద్దగా ఎవరి కళ్లకు ఆనలేదు కానీ, నిజానికి సప్తమి రియల్ గా చాలా అందంగా ఉంటుంది.

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా తమ్ముడు సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా, ఈ మూవీలో హీరోయిన్ గా సప్తమి గౌడను ఎంచుకున్నట్లు సమాచారం. ఈ మూవీలోని సప్తమికి మంచి యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్ర దక్కినట్లు తెలుస్తోంది.

ఇందులో సీనియర్ హీరోయిన్ లయ, నితిన్ కి అక్క పాత్రలో నటిస్తుందట. ఈ తమ్ముడు మూవీ కనుక క్లిక్ అయితే, సప్తమి కి తెలుగులో మరిన్ని ఆఫర్లు క్యూ కట్టే అవకాశం లేకపోలేదు. ఈ సినిమాతో పాటు, బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి తెరకెక్కిస్తున్న వ్యాక్సిన్ వార్ మూవీలోనూ సప్తమి నటిస్తుండటం విశేషం. ఈ మూవీ సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.