Begin typing your search above and press return to search.

సూపర్‌ హిట్‌ షో సీజన్‌ 3.. ఒక్క ఎపిసోడ్‌కి రూ.5 కోట్ల పారితోషికం!

త్వరలోనే మూడో సీజన్ స్ట్రీమింగ్‌ ప్రారంభం కాబోతుంది అంటూ అధికారిక ప్రకటన వచ్చింది.

By:  Tupaki Desk   |   21 Feb 2025 6:02 AM GMT
సూపర్‌ హిట్‌ షో సీజన్‌ 3.. ఒక్క ఎపిసోడ్‌కి రూ.5 కోట్ల పారితోషికం!
X

బాలీవుడ్‌లో ఈమధ్య భారీ బడ్జెట్‌ సినిమాలు సైతం బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. దాంతో హీరోల పారితోషికాలు చాలా తగ్గాయని, సినిమాల బడ్జెట్‌ విషయంలోనూ నిర్మాతలు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారనే విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలో ఎంతో మంది యంగ్‌ బాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో పోల్చితే కమెడియన్‌ కపిల్‌ శర్మ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ కోసం కపిల్‌ శర్మ 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' చేస్తున్నారు. ఇప్పటి వరకు రెండు సీజన్‌లను పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్‌కి రెడీ అయింది. త్వరలోనే మూడో సీజన్ స్ట్రీమింగ్‌ ప్రారంభం కాబోతుంది అంటూ అధికారిక ప్రకటన వచ్చింది.

నెట్‌ఫ్లిక్స్‌లో దాదాపు 8 వారాల పాటు ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో రెండు సీజన్‌లు వరల్డ్‌ వైడ్‌గా ట్రెండ్‌ అయ్యాయి. అత్యధికంగా చూసిన కామెడీ షోగానూ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ షో నిలిచింది. అందుకే ఈ సూపర్‌ హిట్ షో కి సీజన్‌ 3 ని వెంటనే మొదలు పెట్టాలని నెట్‌ఫ్లిక్స్‌తో పాటు కపిల్‌ శర్మ నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను కపిల్‌ శర్మకు ఏకంగా రూ.5 కోట్ల పారితోషింకను ఒక్క ఎపిసోడ్‌కు ఇవ్వనున్నారు. ఇంతకు ముందు ఎపిసోడ్స్‌తో పోల్చితే ఈసారి పారితోషికం దాదాపు 30 నుంచి 40 శాతం పెంచారని తెలుస్తుంది. షో సక్సెస్ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ పారితోషికం పెంచి ఇచ్చేందుకు రెడీ అయింది. కపిల్‌ శర్మ సైతం సీజన్ 3 అంతకు మించి వినోదాన్ని పంచబోతున్నారు.

ఈమధ్య కాలంలో కామెడీ షోలకు మంచి డిమాండ్‌ ఉంది. డీసెంట్‌ కామెడీని ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల వారు ఎంజాయ్‌ చేస్తున్నారు. అందుకే నెట్‌ ఫ్లిక్స్ భారీగా బడ్జెట్‌ ఖర్చు చేసిది గ్రేట్ ఇండియన్ కపిల్ షో 3వ సీజన్‌ను రూపొందించే పనిలో ఉంది. ఇప్పటికే ఎపిసోడ్స్ చిత్రీకరణ ప్రారంభం అయిందని, గత రెండు సీజన్‌లలో ప్రముఖ బాలీవుడ్‌ స్టార్స్‌తో పాటు సౌత్‌ ఇండియన్‌ స్టార్స్‌ సైతం షో లో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ 'దేవర' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ షో లో పాల్గొన్నారు. ఈసారి కూడా నార్త్‌ ఇండియన్‌ స్టార్స్‌తో పాటు సౌత్‌ ఇండియన్‌ స్టార్స్‌ను మూడో సీజన్‌లో పార్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో మూడో సీజన్‌కి ఒక్కో ఎపిసోడ్‌కి గాను కపిల్ శర్మ రూ.5 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడు అనే వార్త సంచలనంగా మారింది. సీజన్‌ మొత్తానికి గాను ఆయన దాదాపుగా రూ.100 కోట్ల పారితోషికం సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సైతం ఇంత పారితోషికం అందుకోవడం లేదు అంటూ బాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే షో లో కనిపించే కమెడియన్స్‌కి మాత్రం చాలా తక్కువ పారితోషికం ఇస్తారనే విమర్శలు ఉన్నాయి. గతంలో శాటిలైట్‌ ఛానల్‌ కోసం కపిల్‌ శర్మ షో చేసినప్పుడూ పారితోషికం భారీగా అందుకున్నారు. కామెడీ షోలకు పెట్టింది పేరు అయిన కపిల్‌ శర్మ ముందు ముందు మరింత పారితోషికాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.