Begin typing your search above and press return to search.

స‌ఫారీ డిజైన్ లో క‌పూర్ బ్యూటీ సెగ‌లు!

క్యాట్ లుకింగ్ స్టైల్ కి ఎవ‌రైనా ప‌డాల్సిందే అన్న‌ట్లు గా అలా ఓ భంగిమ‌లో ఇచ్చిన ఫోజు సంథింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది.

By:  Tupaki Desk   |   3 Nov 2023 5:45 AM GMT
స‌ఫారీ డిజైన్ లో క‌పూర్ బ్యూటీ సెగ‌లు!
X

బాలీవుడ్ లో ఎంత మంది సీనియ‌ర్ భామ‌లున్నా క‌రీనా క‌పూర్ మాత్రం సంథింగ్ స్పెష‌ల్. 43 ప్ల‌స్ లోనూ 25 బ్యూటీలా సెగ‌లు పెట్టించ‌డం క‌రీనాకే చెల్లింది. వ‌య‌సు ముదురుతోన్న కొద్ద అందం అంత‌కంత‌కు రెట్టింపు అవుతుందో త‌ప్ప‌! త‌రుగుతోన్న సంద‌ర్భం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఇప్ప‌టికే కరీనా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లైంది? కానీ బ్యూటీ విష‌యంలో ఇసుమొత్తు కూడా మార్పు కూడా రాలేదు.


అదే ఫిట్ నెస్ మెయింటెన్ చేస్తూ న‌వ‌నాయిక‌ల‌కు గ‌ట్టిపోటీనిస్తుంది. క‌రీనా మంచి ఫిట్ నెస్ ప్రీక్ కావ‌డంతోనే ఇదంతా సాధ్య‌మైంది. తాజాగా క‌పూర్ బ్యూటీ స్టైలిష్ లుక్ ఒక‌టి ఇన్ స్టాలో చ‌క్కెర్లు కొడుతుం ది. అందులో క‌రీనా షోల్డ‌ర్ లెస్ స‌పారీ త‌ర‌హా డిజైన్ దుస్తుల్లో క‌నిపిస్తుంది. అమ్మ‌డు అందంగా ముస్తాబై చైర్ లో కూర్చుని వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చింది.


క్యాట్ లుకింగ్ స్టైల్ కి ఎవ‌రైనా ప‌డాల్సిందే అన్న‌ట్లు గా అలా ఓ భంగిమ‌లో ఇచ్చిన ఫోజు సంథింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది. ఇక క‌రీనా స్లైల్ క్లీవేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. త‌న‌దైన మార్క్ ఎలివేష‌న్ తో ఆక‌ట్టుకుం టుంది. ఇది ఓ రెస్టారెంట్ లో క్యాప్చ‌ర్ చేసిన పిక్ . ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానులు త‌మదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.


క‌రీనా సినిమాల సంగతి చూస్తే అమ్మ‌డికి `ఉడ్తా పంజాబ్`..`వీర్ ది వెడ్డింగ్` త‌ర్వాత స‌రైన స‌క్సెస్ ప‌డిన‌ట్లు క‌నిపించ‌లేదు. భారీ అంచ‌నాల‌మ‌ధ్య రిలీజ్ అయిన సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్ల జాబితాలో చేరుతున్నాయి. ఆ రెండు విజ‌యాల త‌ర్వాత చేసిన నాలుగు సినిమాలు ఒకే ర‌క‌మైన ఫ‌లితాలు సాధించాయి. ఇటీవ‌ల రిలీజ్ అయిన ది `బ‌కింగ్ హ‌మ్ మ‌ర్డ‌ర్స్` కూడా అంచ‌నాలు అందుకోలేదు. ఈ చిత్రానికి నిర్మాత‌గానూ వ్య‌హరిం చింది. ప్ర‌స్తుతం `దిక్రూ`..`సింగం ఎగైన్` చిత్రాల్లో న‌టిస్తోంది.