Begin typing your search above and press return to search.

ల‌గ్జ‌రీ కార్ల‌తో అక్కా చెల్లెళ్లు ధ‌మాకా ఫెస్టివ‌ల్

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌టవార‌సురాళ్లు జాన్వీ క‌పూర్- ఖుషి క‌పూర్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.

By:  Tupaki Desk   |   23 Aug 2024 6:30 AM GMT
ల‌గ్జ‌రీ కార్ల‌తో అక్కా చెల్లెళ్లు ధ‌మాకా ఫెస్టివ‌ల్
X

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌టవార‌సురాళ్లు జాన్వీ క‌పూర్- ఖుషి క‌పూర్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తొలుత జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది. ఇప్ప‌టికే స్టార్ గా నిరూపించుకుని కెరీర్ లో జోష్ చూపిస్తోంది. మ‌రోవైపు ఖుషి క‌పూర్ ఓటీటీ సిరీస్ ది ఆర్చీస్ తో న‌టిగా ప‌రిచ‌య‌మైంది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.

అక్కా చెల్లెళ్ల గ్రాఫ్ పెరిగే క్ర‌మంలో వ‌రుస‌గా ల‌గ్జ‌రీ కార్లు కొనుగోలు చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఆ ఇద్ద‌రూ ఇటీవ‌ల ఒక్కొక్క‌టి రూ.2.5 ల‌క్ష‌ల ఖ‌రీదైన ల‌గ్జ‌రీ బ్రాండ్ కార్ల‌ను కొనుగోలు చేసారు. ముందుగా ఖుషి క‌పూర్ మెర్సిడెస్ బెంజ్- జి క్లాస్ వాగ‌న్ కార్ ని కొనుగోలు చేసింది. దీని ఖ‌రీదు సుమారు 2.5 కోట్ల నుంచి 4 కోట్ల మ‌ధ్య ఉంది. అయితే ఖుషి క‌పూర్ సంపాదించిన దాంతోనే ఈ ల‌గ్జ‌రీ కార్ ని కొనుగోలు చేసిందా లేక పాపా బోనీ క‌పూర్ పేమెంట్ చేసారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండ‌గానే జాన్వీ క‌పూర్ కూడా త‌న సోద‌రితో పోటీప‌డుతూ 2.5 కోట్ల ఖ‌రీదు చేసే కొత్త టొయోటా లెక్సస్ ఎమ్‌పివిని కొనుగోలు చేసింది. తన కొత్త SUVలో హీరో వరుణ్ ధావన్ తో క‌లిసి రైడ్ కి వెళ్లింది. టయోటా లెక్సస్ ఎమ్‌పివి విషయానికి వస్తే, తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ లగ్జరీ కారును కొనుగోలు చేసిన మొదటి తెలుగు స్టార్ అక్కినేని నాగార్జున. ఎన్టీఆర్ కూడా కొనుగోలు చేసారు. ఇప్పుడు యువ‌క‌థానాయిక‌లు కూడా ఈ జాబితాలో చేరుతుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

జాన్వీ క‌పూర్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ స‌ర‌స‌న దేవ‌ర‌లో న‌టిస్తోంది. మ‌రోవైపు ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లిన రామ్ చరణ్ కొత్త సినిమాలో కూడా జాన్వీ కనిపించనుంది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

మ‌రోవైపు ఖుషి క‌పూర్ సైఫ్ అలీఖాన్ కుమారుడి డెబ్యూ సినిమాలో న‌టిస్తోంది. ఇది త‌న‌కు పెద్ద తెర ఆరంగేట్ర చిత్రం. మ‌రోవైపు ఖుషి తెలుగులో నంద‌మూరి బాల‌కృష్ణ కుమారుడు మోక్ష‌జ్ఞ స‌ర‌స‌న నాయిక‌గా ప‌రిచ‌యం కానుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అయితే అధికారికంగా వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.