వాళ్ల సినిమాలకు లాజిక్ అవసరం లేదంటున్న కరణ్ జోహార్
బాహుబలి దర్శకత్వంలో వచ్చిన రెండు పార్టులను హిందీలో రిలీజ్ చేసి కరణ్ జోహార్ ఎంతో లాభం పొందాడు.
By: Tupaki Desk | 17 Feb 2025 6:07 AM GMTబాహుబలి దర్శకత్వంలో వచ్చిన రెండు పార్టులను హిందీలో రిలీజ్ చేసి కరణ్ జోహార్ ఎంతో లాభం పొందాడు. అప్పట్నుంచి వారిద్దరి మధ్య మంచి అనుబంధముంది. గతంలో రాజమౌళిని ఓ సారి మొఘల్ ఎ అజామ్ తీసిన లెజెండరీ దర్శకుడు ఆసిఫ్ తో పోల్చి, ఈ జెనరేషన్ లో రాజమౌళిని మించిన డైరెక్టర్ లేడని కరణ్ జోహార్ తేల్చి చెప్పాడు.
రాజమౌళి లాంటి గొప్ప మేధావితో కలిసి వర్క్ చేసినందుకు ఎంతో గర్వంగా ఉందని, కచ్ఛితంగా ఈ తరంలో రాజమౌళినే బెస్ట్ డైరెక్టర్ అని, ఆయన్ని మ్యాన్ ఆఫ్ ది డికేడ్ అని ప్రశంసించాడు కరణ్. అయితే ఇప్పుడు మరోసారి రాజమౌళి గురించి కరణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
గొప్ప సినిమాలకు లాజిక్ తో పన్లేదని, అలాంటి సినిమాలు రాజమౌళి తీశాడని కరణ్ చెప్పాడు. డైరెక్టర్ తన సినిమాను నమ్మి నమ్మకంగా ఉంటే సినిమా కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని.. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, అనిల్ శర్మ అలాంటి సినిమాలు తీశారని కరణ్ జోహార్ తెలిపాడు. గొప్ప డైరెక్టర్ సినిమాల విషయాల్లో లాజిక్ కంటే నమ్మకమే ఎక్కువగా వర్కవుట్ అవుతుందని కరణ్ ఈ సందర్భంగా చెప్పాడు.
రాజమౌళి సినిమాలను గమనిస్తే ఆయన సినిమాల్లో లాజిక్ గురించి ఆడియన్స్ ఎప్పుడూ ఆలోచించరని, కనీసం మాట్లాడుకోరని, ఆయనకు తన కథపై ఎంతో నమ్మకముంటుందని, అందుకే ఎలాంటి సీన్ ను అయినా ఆడియన్స్ కు నమ్మకం కలిగేలా తీయగలడని కరణ్ తెలిపాడు. ఆర్ఆర్ఆర్, యానిమల్, గదర్ లాంటి సినిమాలకు కూడా ఇదే వర్తించిందని చెప్పాడు కరణ్.
ఆ సినిమాలు హిట్ అవడానికి కంటెంట్ తో పాటూ ఆడియన్స్ కు డైరెక్టర్లపై ఉన్న నమ్మకం, డైరెక్టర్లకు కథపై ఉన్న నమ్మకం కూడా కారణాలని కరణ్ జోహార్ అభిప్రాయపడ్డాడు. సినిమాను ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడాలని లాజిక్స్ గురించి ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగముండదని కరణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరవుతున్నాయి.