ట్రామాలోకి వెళ్లిపోయానని అగ్రనిర్మాత ఆవేదన
తాజా ఇంటర్వ్యూలో డీల్ కోసం తమ వ్యాపార భాగస్వామితో సాగించిన పరిభాష బాధ కలిగించిందని అన్నారు.
By: Tupaki Desk | 16 Nov 2024 11:30 PM GMTఅమ్మకాలు కొనుగోళ్లు తనకు తెలియదని, కానీ అలాంటి పరిస్థితి తనకు వచ్చిందని, అది బాధకు గురి చేసిందని అన్నారు అగ్ర నిర్మాత కరణ్ జోహార్. ఇటీవల తన కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్‌లో 50 వాతం వాటాను బిలియనీర్ వ్యాపారవేత్త అదార్ పూనావల్లకు చెందిన సెరీన్ ప్రొడక్షన్స్‌కు రూ.1,000 కోట్లకు విక్రయించాడు. తాజా ఇంటర్వ్యూలో డీల్ కోసం తమ వ్యాపార భాగస్వామితో సాగించిన పరిభాష బాధ కలిగించిందని అన్నారు.
ఈ సమావేశాలు బాధ కలిగించాయని కరణ్ అన్నాడు. ``నాకు విలువ ఉందని నాకు తెలియదు. నేను తెలుసుకున్నాను. ఇది నేను చెప్పాలి. నేను బహుశా తెలివైనవాడిగా కనిపించను. నేనెవరో కనిపించాలనుకుంటున్నాను. నేను ఆ సమావేశాలలో చాలా బాధపడ్డాను. నేను సృజనాత్మక కళాకారుడిని. పుట్- కాల్- డ్రాగ్- ట్యాగ్ అంట అక్కడ మాట్లాడిన భాష బాధ కలిగించిందని కరణ్ అన్నాడు. డీల్ కి సంబంధించిన ఆ ఎక్సెల్ షీట్లు నా ముందుకి వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. నీ రియాలిటీ నీవైపే చూస్తోంది. నేను చాలా భారీ పనిని చేశానని అనుకుంటాను. చివరిగా ఒక విలువను ఇచ్చారు.. అని తెలిపాడు.
ఆదార్ పూనావాలా ప్రదర్శించిన ఉత్సుకత డీల్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ దాదాపు స్ఫూర్తిదాయకం. మేము జూమ్ కాల్‌లో ఈ డీల్‌లో ఎక్కువ భాగాన్ని పూర్తి చేసాము. ఆదార్ కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆపై అతడు ఏమన్నాడంటే.. ``సరే, మనం ఎక్కడ సంతకం చేయాలి?`` అని అన్నాడు. నిజానికి నేను ఆర్థిక స్థోమత ఉంటే ఈ విధంగా వ్యాపారం చేయడానికి ఇష్టపడతాను. నేను భరించలేను. అతడు చేయగలడు అని కరణ్ అన్నారు. ఆదార్ తన కంపెనీలో వాటా కొనుగోలు చేయడం వల్ల గతంలో కంటే తన కంపెనీకి మరింత బాధ్యత జవాబుదారీతనం ఏర్పడిందని కూడా అతడు పేర్కొన్నాడు. అది నన్ను ఎగ్జయిట్ చేయడమే కాదు.. నిద్రలేని రాత్రులు ఇచ్చింది.
చిన్ననాటి స్నేహితుడు, ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతా లేదా అతని తండ్రి, దివంగత చిత్రనిర్మాత యష్ జోహార్ కూడా చేయలేని విధంగా అదార్ తన కంపెనీకి మరింత బాధ్యత వహిస్తాడని కరణ్ చెప్పాడు.
2004లో తన తండ్రి మరణించిన తర్వాత కరణ్ వ్యాపారాన్ని చేపట్టడానికి ముందు యశ్ జోహార్ 1980లో ధర్మ ప్రొడక్షన్స్‌ని స్థాపించారు. కరణ్ తన తండ్రి లెగసీని విజయవంతంగా ముందుకు నడిపించారు. అయితే ఇటీవల మారిన పరిస్థితులు సినీవ్యాపారంలో చిక్కులు తెచ్చాయని కరణ్ వాపోయరు. భారీ పారితోషికాలు సమస్యాత్మకంగా మారాయని కూడా కరణ్ అన్నారు. ఇంతలోనే ఇప్పుడు ఈ డీల్ ని కుదుర్చుకున్నారు.