4.5 లక్షల గౌను 82 వేలకే అంటే ఎగబడితే ఇలా!
కానీ అన్నీ తెలిసిన మేధావులు సైతం మోసపోతేనే చింతించాల్సిన పరిస్థితి. ఇందులో చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు.
By: Tupaki Desk | 22 Feb 2025 7:30 AM GMTకాదేది కవితకు అనర్హం అని ఓ మహాకవి అన్నట్లు మోసపోవడానికి ఎవరూ అతీతులు కాదని సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. ఆన్ లైన్ మోసాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. టెక్నాలజీ ఎంతగా అందుబాటులోకి వచ్చిందో? మోసాలు కూడా అంతే అడ్వాన్స్ గా జరుగుతున్నాయి. ఏమీ తెలియని అమాయకులు మోసపోయారంటే? అర్దం ఉంది.
కానీ అన్నీ తెలిసిన మేధావులు సైతం మోసపోతేనే చింతించాల్సిన పరిస్థితి. ఇందులో చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. చవక చవక అంటూ ఎర వేసేసరికి! అడ్డంగా బుక్ అవుతున్నారు. అలాంటి ఓ నటి కథని దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఇలా పంచుకున్నారు. ఓ నటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి సిద్దమవుతోంది. ఈ క్రమంలో అందమైన డిజైనర్ గౌను విక్రయించాలనుకుంది.
దీంతో ఆన్ లైన్ ఇన్ స్టాగ్రామ్ నుంచి ఆ డిజైన్ గౌను కొనాలనుకుంది. ఆ గౌను అసలు ధర 4.5 లక్షలు కాగా, అదే గౌను ఇన్ స్టాలో 82 వేలకే అందించబడుతుందని ఆఫర్ ప్రకటించారు. ఈ ఆఫర్ ఏదో బాగుందనుకుంది? ఆలస్యం చేస్తే ఆ గౌను ఇంకేవరైనా కొనేస్తారు? అన్న కంగారులో వెనకా ముందు ఆలోచించకుండా 82కె ఆ గౌను కొనేసింది. అంతకు ముందు స్కామర్లు తమని నమ్మబలికే టెక్నిక్ లు కొన్ని వాడారు.
దీంతో ఇదంతా అధికారిక సైట్ ద్వారానే జరుగుతుందనుకుని ఆలోచించకుండా యూపీఐ పేమెంట్ చేసింది. కానీ అది బుక్ అయిందా? డెలివిరీ అవుతుందా? అన్నది మాత్రం ఎలాంటి మెసేజ్ రాలేదు. పేమెంట్ కంప్లీట్ అయ్యేసరికి మోసగాళ్లు ఎస్కేప్ అయిపోయారు. పేరున్న వాళ్లు..అన్ని తెలిసిన వాళ్ల విషయంలోనే ఇలా జరుగుతుంటే? సాధారణ కొనుగోలు దారుల పరిస్థితి ఏంటి? కరణ్ ప్రశ్నించారు. రోజు రోజుకి ఆన్ లైన్ స్కాములు పెరిగిపోతున్నాయని కొనుగోలుదారులు విశ్వాసం కోల్పోతున్నారని ఆవేదన చెందారు.