నెపో బేబి టీషర్టుతో కరణ్.. కంగన చూడలేదింకా!
బాలీవుడ్ టు టాలీవుడ్.. టాలీవుడ్ టు హాలీవుడ్ `నెపోటిజం- బంధుప్రీతి` గురించి నిరంతరం చాలా చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 11 Jan 2025 2:30 PM GMTబాలీవుడ్ టు టాలీవుడ్.. టాలీవుడ్ టు హాలీవుడ్ `నెపోటిజం- బంధుప్రీతి` గురించి నిరంతరం చాలా చర్చ సాగుతోంది. బాలీవుడ్‌లో కంగనా రనౌత్ తన ప్రత్యర్థి అయిన కరణ్‌ను `బంధుప్రీతి పతాకధారి` అని కామెంట్ చేసారు. నేరుగా కాఫీ విత్ కరణ్ షోలోనే అతడిపై కంగన ఫైర్ అయింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో బంధుప్రీతి, నెపో కిడ్స్ గురించి చాలా చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో కరణ్ జోహార్ నెపో బేబి టీషర్ట్ ధరించి నగరంలో జరిగిన ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. కరణ్ .. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి పూర్తిగా తెల్లటి దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేసాడు. కరణ్ తనదైన శైలిలో స్టేట్‌మెంట్ నెక్లెస్‌ను కూడా ప్రదర్శించాడు. ర్యాంప్ షోలో చొక్కా గుండీలు విప్పి తన టోన్డ్ బాడీని, నెక్లెస్ ను కూడా చూపించాడు. అయితే ఆ సమయంలో అతడి టోన్డ్ బాడీ వీక్షకుల్లో చర్చకు వచ్చింది. కరణ్ బాగా బరువు తగ్గడంపైనా సోషల్ మీడియాల్లో పుకార్లకు దారితీసింది. అతడు బరువు తగ్గించే డ్రగ్ ఓజెంపిక్ తీసుకుంటున్నాడా? అని చాలా మంది ఊహాగానాలు సాగించారు. అయితే ఆరోగ్యంగా ఉండటం.. బాగా తినడం వల్లే తాను బరువు తగ్గానని కెజోవో తన ఇన్‌స్టా కథనంలో స్పష్టం చేశారు.
తన స్నేహితులు.. గౌరీ ఖాన్ - మలైకా అరోరాతో డిన్నర్ డేట్‌కు బయలుదేరినప్పుడు అందరూ కరణ్ పైనా అతడి టీ-షర్టుపైనా దృష్టి పెట్టడానికి కారణం `నెపో కిడ్` అని రాసి ఉండటమే. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఆ టీ షర్టు జనవరి 2023లో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన హేలీ బీబర్ వెకేషన్ లుక్ తో సరిపోలింది. నాటి వెకేషన్ లో హేలీ బీబర్ కత్తిరించిన `నెపో బేబీ` టీ షర్ట్ ని ధరించింది. అదే సమయంలో హాలీవుడ్‌లో బంధుప్రీతి గురించి పెద్ద చర్చ సాగింది. ఇప్పుడు బాలీవుడ్ లో బంధుప్రీతి ముచ్చట సాగుతుండగా కరణ్ ఇలా నెపో బేబి టీషర్ట్ ని ధరించాడు.