స్టార్ ఫిల్మ్ మేకర్ కీ ఘోర పరాభవం తప్పలేదు
మరీ ఇలాంటి దారుణమైన ఓపెనింగ్స్ ఉంటాయని ఏ ఒక్కరు ఊహించలేదు. మొదటి రోజు కేవలం రూ.11 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.
By: Tupaki Desk | 29 July 2023 9:42 AM GMT2016 లో 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ సినిమాకు దర్శకత్వం వహించలేదు. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలను రూపొందించిన కరణ్ జోహార్ పూర్తిగా నిర్మాణంపై దృష్టి పెట్టాడు. నిర్మాతగా స్టార్ ఫిల్మ్ మేకర్ అనే పేరును కూడా దక్కించుకున్నాడు. ఈ మధ్య కాలంలో బడా దర్శకులు సైతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నారు.
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను సునాయాసంగా రాబట్టిన స్టార్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు అత్యంత దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో కరణ్ జోహార్ నుండి సినిమా వస్తుండటంతో అందరి దృష్టి 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' సినిమాపై ఉంది.
రణవీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన ఈ సినిమా కి మంచి పబ్లిసిటీ చేశాడు. బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ చాలా సంవత్సరాల తర్వాత రూపొందించిన సినిమా అంటూ తెగ ప్రచారం చేయడంతో మంచి ఓపెనింగ్స్ లభించడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ దారుణమైన ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి.
సినిమా విడుదల అయిన వెంటనే బాలీవుడ్ లో మేము గొప్ప అంటూ ప్రచారం చేసుకునే సినీ విమర్శకులు.. రివ్యూవర్స్ మూడు నాలుగు అంటూ రేటింగ్స్ ఇచ్చేశారు. కానీ కలెక్షన్స్ ను చూస్తే మాత్రం సినిమా అసలు విషయం ఏంటి అనేది తేలిపోయింది. మరీ ఇలాంటి దారుణమైన ఓపెనింగ్స్ ఉంటాయని ఏ ఒక్కరు ఊహించలేదు. మొదటి రోజు కేవలం రూ.11 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.
ఈ మధ్య కాలంలో తెలుగు తమిళ సినిమాలు హిందీలో ఇంతకు మించి వసూళ్లు నమోదు చేస్తున్నాయి. అలాంటిది బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ గా పేరున్న కరణ్ జోహార్ సినిమా కి కూడా ఘోర పరాభవం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తప్పలేదు. బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో చాలా పెద్ద సినిమాలకు వచ్చిన ఫలితమే రాకీ ఔర్ రాణి కి ప్రేమ కహాని కి వచ్చింది అంటూ మీడియా వర్గాల టాక్.