వైలెంట్ గా వచ్చి సైలెంట్ అయిపోయిన నిర్మాత!
కొంత కాలంగా నిర్మాణంపైనే దృష్టి పెట్టిన కరణ్ ఇప్పుడు మళ్లీ మేకర్ గానూ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు.
By: Tupaki Desk | 6 Dec 2023 6:55 AM GMTబాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ సినిమా అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ అని చెప్పాల్సిన పనిలేదు. ధర్మ ప్రొడక్షన్స్ నుంచి సినిమా రిలీజ్ అవుతుందంటే? హిందీ అభిమానుల్లో భారీ అంచనాలుంటాయి. ఇప్పుడా క్రేజ్ సౌత్ లోనూ గట్టిగానే కనిపిస్తోంది. సౌత్ స్టార్లు అతని కాపీ షో లో ప్రత్యక్షమవ్వడంతో కరణ్ సౌత్ లోనూ బాగా ఫేమస్ అవుతున్నారు. ఇలా రకరకాల కారణాలు కరణ్ రేంజ్ ని రెట్టింపు చేసాయి. అందుకే మళ్లీ దర్శకుడిగానూ బిజీ అవుతున్నారు.
కొంత కాలంగా నిర్మాణంపైనే దృష్టి పెట్టిన కరణ్ ఇప్పుడు మళ్లీ మేకర్ గానూ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కార్తీక్ ఆర్యన్ తో ఓ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఎంతో వైలెంట్ గా ప్రకటించారు. సినిమా ప్రారంభానికి ముందే 2025 ఆగస్టు 14న స్వాతంత్య్రానికి ఒక్క రోజు ముందుగానే చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ఎంతో గర్వంగా ప్రకటించారు. ఆ ప్రకటన చూసి ఇది దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ అని అంచనాలు మొదలయ్యాయి.
అయితే ఇప్పుడీ చిత్రం రిలీజ్ తేదిని కరణ్ జోహార్ వెనక్కి తీసుకని షాక్ ఇచ్చాడు. మా సినిమాని ఆగస్టు లో కాదు గాంధీ జయంతి సందర్భంగా అదే ఏడాది అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరి కరణ్ ఇలా ఎందుకు వెనక్కి వెళ్లారో? తెలుసా అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. సరిగ్గా ఆగస్టు 14న `వార్ -2` కూడా రిలీజ్ అవుతుంది. యశ్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుందో చెప్పాల్సిన పనిలేదు.
హృతిక్ రోషన్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ఇది. పాన్ ఇండియాలో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. త్వరలో తారక్..హృతిక్ కూడా టీమ్ తో జాయిన్ అవుతారు. ఇలా వైఆర్ ఎఫ్ బ్యానర్లో వచ్చే సినిమాకి ఇన్ని ప్రత్యేక తలు ఉండటంతో కరణ్ జోహార్ తన చిత్రాన్ని తానే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పోటీ కాన్న రాజీ మంచిదని ఇలా వెనక్కి వెళ్తున్నారు.