ఇద్దరు హీరోయిన్లతో అగ్రనిర్మాత బ్రేకప్
పరిశ్రమలో నిరంతరం హెడ్ లైన్స్ లో ఉండే ప్రముఖ వ్యక్తులలో కరణ్ జోహార్ ఒకరు. అతడిని ఎవరైనా ప్రేమిస్తారు లేదా ద్వేషిస్తారు.. కానీ కచ్చితంగా అతడిని విస్మరించలేరు
By: Tupaki Desk | 11 Nov 2023 3:22 AM GMTపరిశ్రమలో నిరంతరం హెడ్ లైన్స్ లో ఉండే ప్రముఖ వ్యక్తులలో కరణ్ జోహార్ ఒకరు. అతడిని ఎవరైనా ప్రేమిస్తారు లేదా ద్వేషిస్తారు.. కానీ కచ్చితంగా అతడిని విస్మరించలేరు. కరణ్ జోహార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా దుర్భలుడు కాదు. బాలీవుడ్ లో అతడిని అమితంగా ఇష్టపడే వారు ఉన్నారు. కాఫీ విత్ కరణ్ 8 మూడవ ఎపిసోడ్‌లో కరణ్ జోహార్ ఇద్దరమ్మాయిల(హీరోయిన్లు)తో తన స్నేహం బ్రేకప్ గురించి మాట్లాడి ఆశ్చర్యపరిచారు.
ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? అంటే.. అందులో ఒకరు కరీనా కపూర్ ఖాన్ - మరొకరు కాజోల్. వారితో తనకున్న సంబంధాల గురించి కరణ్ ఓపెన్ గా మాట్లాడాడు. అవును.. ఒకప్పుడు, కల్ హో నా హో సమయంలో బెబోతో అతడు కఠినమైన విరోధాన్ని ఎదుర్కొన్నాడు. కరీనాను కరణ్ బహిరంగ వేదికపై దూషించాడు. కానీ బెబో అభిమానులు మాత్రం అతడిని టార్గెట్ చేసి దుమ్ము దులిపేసారు. అయితే ఆ తర్వాత కరణ్ తగ్గాడు. తన తండ్రి మరణం తర్వాత బెబోతో తన స్నేహాన్ని ఎలా తిరిగి పొందాడో KJo వెల్లడించాడు.
''నాకు ఏమి చెప్పాలో తెలియదు. నాన్న మరణించినప్పుడు, కరీనా బ్యాంకాక్‌లో ఉంది. మా మధ్య ఇంకా పరిస్థితులు బాగుపడలేదు. ఆ సమయంలో బెబో షూట్ నుండి దిగింది. మా ఇంటికి వచ్చింది. రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ గడిపాము. మేము ఉన్న చోటికి తిరిగి వెళ్ళాము. మేము ఒకరితో ఒకరు ఫైట్ చేసినప్పుడు నేను బెబోతో మళ్లీ మాట్లాడబోనని చెప్పాను.. అని కరణ్ తెలిపాడు.
అదే కాఫీ విత్ కరణ్ సంభాషణలో కాజోల్‌తో కూడా అలాంటిదే జరిగిందని కరణ్ తెలిపాడు. వారు గొడవ పడ్డారు, కానీ యష్ - రూహి పుట్టిన సమయంలో కరణ్ స్వయంగా కాజోల్‌కి సందేశం పంపాడు. పిల్లల ఫోటోలను తనకు పంపాడు. ప్రత్యుత్తరం ఇవ్వకుంటే ఫర్వాలేదు అని కూడా చెప్పాడు. కానీ కరీనా తిరిగి సందేశం పంపింది. నేను ప్రస్తుతం ప్రేమతో నిండి ఉన్నాను అని చెప్పింది. ఒక నెల తర్వాత '' నా పుట్టినరోజు.. మీరు రావలసిన అవసరం లేదు'' అని మెసేజ్ పెట్టింది. కానీ నేను వెళ్ళాను. మేము కౌగిలించుకున్నాము.. ఏడ్చాము..అని కరణ్ తెలిపాడు. నిజానికి కరణ్ జోహార్‌కి ఇండస్ట్రీలో మంచి స్నేహితులున్నారు. సంబంధం లేని శూన్యం గురించి తరచుగా మాట్లాడే వ్యక్తి కచ్చితంగా కొన్ని మంచి స్నేహాలను కలిగి ఉంటాడు. ఆ స్నేహం శాశ్వతంగా ఉంటుంది.