Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్.. టైటిల్ వెనుక ఎన్ని పాట్లో..

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక సీక్రెట్ రా ఏజెంట్ గా కనిపించనున్నాడు.

By:  Tupaki Desk   |   18 May 2024 12:58 PM GMT
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్.. టైటిల్ వెనుక ఎన్ని పాట్లో..
X

గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "దేవర" మరియు "వార్ 2" సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ముందుగా దేవర సినిమా షూటింగ్ అయితే దాదాపు తుది దశకు చేరుకుంది రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలో మామూలుగా లేవు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.

ఇక వార్ 2 హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక సీక్రెట్ రా ఏజెంట్ గా కనిపించనున్నాడు. అతని క్యారెక్టర్ కొంత నెగిటివ్ షెడ్ లో ఉంటుందని టాక్. ఇక ఇప్పుడు మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌ పై దృష్టి సారించారు. ఈ చిత్రం పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్న సినిమా.

తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్‌ పై ఆసక్తికరమైన విశేషాలు వెలుగులోకి వచ్చాయి. లేటెస్ట్ టాక్ ప్రకారం, ఈ చిత్రానికి "డ్రాగన్" అనే పవర్ఫుల్ టైటిల్ లాక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ టైటిల్ విషయమై ఆసక్తికరమైన సమాచారాన్ని పరిశీలిస్తే, టైటిల్ లాక్ ఎప్పుడో 2022లోనే జరిగిందని తెలుస్తోంది.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ తన వద్ద ఉన్న "డ్రాగన్" టైటిల్‌ను ఎన్టీఆర్ కోసం వదులుకున్నాడట, అతనికి ఉన్న అభిమానంతో ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది. కరణ్ జోహార్ డ్రాగన్ టైటిల్ ఒక స్టార్ హీరో కోసం లాక్ చేసినప్పటికీ ఆ కథ సెట్టవ్వలేదట. దీంతో ఆ టైటిల్ మాత్రం కరణ్ జోహార్ వదల్లేదు. కానీ ఎన్టీఆర్ కోసం వెంటనే ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ టైటిల్ తమిళ పరిశ్రమలో కూడా ఒక హీరో సినిమా కోసం రిజిస్టర్ చేయించారట. తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్‌తో ఒక దర్శకుడు ఇదే టైటిల్‌ పై సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. ఇక ఆ సినిమాను తెలుగులో కూడా "డ్రాగన్" అనే పేరుతో విడుదల చేయాలని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ పరిణామాలు చూస్తే, "డ్రాగన్" టైటిల్ పై ఉన్న ఆసక్తి ఎన్టీఆర్ 31 పై మరింత హైప్‌ ను కలిగిస్తోంది.

మరి డ్రాగన్ టైటిల్ విషయంలో మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. “కేజీయఫ్” మరియు “సలార్” చిత్రాలతో ప్రశాంత్ నీల్ తన ప్రత్యేకతను నిరూపించుకోగా, ఎన్టీఆర్ యొక్క అద్భుతమైన నటన మరియు స్టైల్ నీల్ కొత్త ప్రాజెక్ట్‌కి మరింత ఆకర్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ పై పలు రకాల వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన వస్తే ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం రేకెత్తిస్తుంది. ఎన్టీఆర్ కెరీర్ లో మరొక కీలకమైన చిత్రంగా “డ్రాగన్” నిలుస్తుందా? లేదా అనేది కాలమే సమాధానం ఇవ్వాలి.